ఏజెంట్లకు ధైర్యమిస్తుందెవరు…?

కరీంనగర్ జిల్లా ఆర్టిఏ కార్యాలయంలో ఏజెంట్ల ఇష్టారాజ్యం వెనకాల ఆ అధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…నేనున్నా ఎంకాదు అంటూ ఎజెంట్లను నియమించుకొని వసూళ్ల భాగోతాన్ని ఆ అధికారి కొనసాగిస్తుండడం వల్లే ఏజెంట్లు బరితెగిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది…హన్మకొండ నుంచి తనకు నమ్మకంగా ఉండే ఓ ఇద్దరు ఎజెంట్లను తీసుకొని వచ్చి వారి ద్వారానే పనులన్నీ చక్కబెడుతూ ఆ అధికారి బాగానే వెనకేస్తున్నట్లు కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి….తాను బదిలీ అయిన చోటుకే ఎజెంట్లను తీసుకువెళ్లడం వెనకాల మతలబు ఏంటో ఆ అధికారికే తెలియాలి…ఎజెంట్లుగా కొనసాగుతున్న ఆ ఇద్దరు హన్మకొండ టు కరీంనగర్ ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో ఆ అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…

ఏంచేసినా చెల్లుతుందా…?

డిటిసి స్థాయి అధికారి త్వరలో జె టి సి గా ప్రమోషన్ గా దగ్గరగా ఉన్న అధికారి ఎజెంట్లను నియమించుకొని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడడం విమర్శలకు దారితీస్తుంది…హన్మకొండ నుంచి తాను అతి నమ్మకంగా తీసుకొచ్చుకున్న ఏజెంట్ ఒకే అంటేనే ఆ అధికారి ఫైల్ ముడుతారట… ఆ ఏజెంట్ కావాల్సింది వసూలు చేసి అంతా ఒకే అంటేనే పెద్దసారు సంతకం చేసి పని కానిచ్చేస్తారట….కరినంగర్ ఆర్టిఏ కార్యాలయంలో కొనసాగుతున్న బహిరంగ వసూళ్ల భాగోతం, ఏజెంట్ల భయంలేని అక్రమ వసూళ్లు చూస్తుంటే ఆ కార్యాలయంలో ఆ అధికారి ఏంచేసినా చెల్లుతుంది అనే బావనలో అధికారి ఉన్నట్లు తెలుస్తుంది…తాను సీనియర్ అధికారిని ఉన్నతాధికారులతో సహా ఎవరైనా తాను చెప్పినట్లు వింటారు అని భావిస్తూ అక్రమ వసూళ్లతో తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…న్యూస్10 స్ట్రింగ్ ఆపరేషన్ తో కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయంలో వసూళ్ల భాగోతాన్ని బయటపెట్టగానే తాను అంతా చూసుకుంట, మీ వసూళ్ల పని మీరు చూసుకోండి అంటూ అక్కడి ఏజెంట్లకు ఆ అధికారి భరోసా ఇచ్చినట్లు తెలిసింది…అక్రమ వసూళ్లను అడ్డుకునే తరం ఎవరి వల్ల కాదు…ఇలాగే వసూళ్లు చేస్తాం అంటూ రవాణా శాఖలో తనకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఆ అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది…

సబార్డినెట్ కీలకం…?
కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయం లో ఓ మహిళ సబార్డినెట్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…ఈ సబార్డినెట్ కార్యాలయంలోకి వచ్చే ఎజెంట్లతో మాట్లాడుతూ వారి పైల్స్ క్షణాల్లో క్లియర్ చేయించి సహకారం అందిస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…పెద్దసారు కు చెందిన ఓ ఏజెంట్ ను కార్యాలయంలోకి పిలిచి ఫైల్ క్లియర్ చేయించి పంపించి ఆ సబార్డినెట్ న్యూస్10 స్ట్రింగ్ ఆపరేషన్ కు చిక్కింది…ఓ అధికారి స్థాయి లో ఈ సబార్డినెట్ అన్ని తానై కార్యలయంలో వ్యవహరిస్తూ అక్కడి పెద్ద సార్ల మన్ననలు పొందుతూ..ఏజెంట్ల అక్రమ వసూళ్లకు సహకరిస్తున్నట్లు అర్థమైపోతుంది… కార్యాలయంలో పెద్ద సారు లేకున్నా ,సారు తనకు తీరిక ఉన్నప్పుడు కార్యాలయానికి వచ్చిన ఈ సబార్డినెట్ ఏజెంట్లు తీసుకువచ్చిన పైల్స్ క్షణాల్లో క్లియర్ చేయించడం పైనే దృష్టి సారిస్తుందని తెలిసింది…దీనికి కావాల్సిన ప్రతిఫలం సబార్డినెట్ స్థాయిలో సబార్డినేట్ కు క్రమం తప్పకుండా ముడుతున్నట్లు సమాచారం…

ఉన్నతాధికారులకు పట్టదా…?

కరీంనగర్ ఆర్టిఏ లో అడ్డగోలు అక్రమ వసూళ్లు, ఏజెంట్లే మధ్యవర్తులుగా ఉంటూ అధికారులకు వసూళ్లు చేసి ఇస్తున్న , రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తుంది….రవాణా శాఖ మంత్రి సొంత ఇలాఖాలో ఓ అధికారి తన ఇష్టం వచ్చినట్లు ఎజెంట్లను నియమించుకొని వసూళ్ల పర్వం కొనసాగించడం ఐయిన రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది…ఇకనైనా కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయంలో కొనసాగుతున్న అక్రమ వసూళ్లపై రవాణా శాఖ ఉన్నత అధికారులు దృష్టి సారిస్తార…?మాకెందుకు లే అని వదిలేసి అక్రమ వసూళ్లను పరోక్షంగా ప్రోత్సహిస్తార…? చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here