రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…ఇప్పటివరకు ఈ శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన డి ఎస్ చౌహాన్ మల్టిజోన్-2ఐజిగా బదిలీ ఐయ్యారు…కాగరాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ కమిషనర్గా బదిలీపై పంపారు. హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సి.వి.ఆనంద్ ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, ఏసీబీ డీజీగా చారుసిన్హాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హా ఉన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలను అప్పగించారు.
హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సి.వి.ఆనంద్
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖాగోయల్
ఏసీబీ డీజీగా చారుసిన్హా కు అదనపు బాధ్యతలు, ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు
ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
మల్టీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహన్;
విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్
పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రెటరీగా స్టీఫెన్ రవీంద్ర
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా అనిల్‌కుమార్
హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్
ఏసీబీ జాయింట్ డైరెక్టర్లుగా సింధుశర్మ, సీహెచ్ ప్రవీణ్‌కుమార్
ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ, మాదాపూర్ డీసీపీగా రుతురాజ్
హైదరాబాద్ నేర విభాగం అదనపు సీపీగా శ్రీనివాసులు
వాణిజ్య పన్నుల కమిషనర్‌గా ఎం.రఘునందన్‌రావు
రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలు
వ్యవసాయశాఖ కమిషనర్‌గా కె.సురేంద్రమోహన్
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు
ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కె.హరిత
టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా సందీప్‌కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఎం.హరిత



