ఖాజీపేట చౌరస్తాలో టిప్పర్ లారీ బీభత్సం

డివైడర్, స్ట్రీట్ లైట్ ధ్వంసం.. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తు..?


కాజీపేట జంక్షన్ పరిధిలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక భారీ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక గాయత్రి స్వీట్ హౌస్ ఎదురుగా మొరం మట్టితో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను, అక్కడే ఉన్న స్ట్రీట్ లైట్ పోల్‌ను బలంగా ఢీకొట్టింది.అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఆ మొరం లారీని అక్కడి నుంచి తరలించకపోగా, ఈరోజు మరో లారీ కూడా అక్కడికి వచ్చి చేరడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న తెలుస్తున్న ఇప్పటికి ఆ వాహనాలు అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది .కాగా ప్రధాన రహదారిలో రెండు భారీ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది… అంబులెన్సు వాహనాలు, వి ఐ పి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here