డి సి ఎస్ ఓ కొత్త…దందా పాతదే

అవును హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గా వచ్చిన ఆయన జిల్లాకు కొత్తే కానీ దందా మాత్రం పాతదే కొనసాగిస్తున్నాడు…వసూళ్ల దందా చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొని వేటు పడ్డ పాత అధికారుల తీరునే ఈ అధికారి అవలంబిస్తున్నాడు…అందినకాడికి దండుకుందాం తర్వాత ఏమైనా అయితే చూసుకుందాం అన్నట్లు డి సి ఎస్ ఓ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది…అంతేకాదు ఈ డి సి ఎస్ ఓ కు ప్రశ్నలు అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్న గిట్టదట… ఏదైనా అంశం పై వివరణ కావాలని జర్నలిస్టులు వెళితే అసహనంగా మాట్లాడుతూ కార్యాలయం ఎదో అతగాడి జాగిరి అయినట్లు ఈయన గారు నిజాం సంస్థానం ప్రభువు అయినట్లు బరితెగింపు మాటలు మాట్లాడడం …ఇష్టారీతిన నాలుక కు పని చెప్పడం ఆ తర్వాత నాలుక కరుచుకోవడం ఈ డి ఎస్ ఓ కు పరిపాటిగా మారింది…ఈయన ఎదో డి ఎస్ ఓ అయినందుకు ఈయన గారికి అందరూ పురుగుల్లా కనపడుతున్నారు…సరిగ్గా ఇలాగే ఈ డి ఎస్ ఓ న్యూస్10 ప్రతినిధితో అమర్యాద గా వ్యవహరించి తన మర్యాదలేని తనాన్ని బయటపెట్టుకున్నాడు…ఈ సారు ను వివరణ అడగాలి అన్న, ఈయన గారి కార్యాలయం లో అడుగుపెట్టాలన్న ఏకంగా ఐ అండ్ పి ఆర్ అధికారుల అనుమతి, వారు ఇచ్చిన కార్డు,అంతేకాదు పత్రిక రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఇతగాడికి చూపించాలట…అప్పుడే మాట్లాడుతా ….వివరణ ఇస్తా అంటూ తన అవగాహన లేమిని డి ఎస్ ఓ బయటపెట్టుకున్నాడు…కేంద్ర ప్రభుత్వ ప్రెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా అనుమతితో నడుస్తున్న పత్రికలు కేవలం ఈ చోటా మోట అధికారి ఇవన్నీ ఎందుకో ఆయనకే తెలియాలి…తనకు తాను బాగ ఊహించుకుంటున్న ఈ డి సి ఎస్ ఓ ఇదే పనికిమాలిన ప్రవర్తన,వసూళ్ల చేతివాటం తో ఇప్పటికే రెండు సార్లు సరెండర్ ఐనట్లు తెలిసింది…సర్వీస్ బుక్ లో సైతం రిమార్కు తో ఈ అధికారి ఘనత చాటినట్లు తెలుస్తుంది..

డి సి ఎస్ ఓ డబుల్ టన్నేజ్ దందా…?

హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో కేటాయించిన వారికే మళ్ళీ
మళ్ళీ ధాన్యం కేటాయిస్తూ అధికారులు కొందరు మిల్లర్ల పట్ల తమ పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…జిల్లాలో ఇప్పటికే కొందరు మిల్లర్లకు సింగిల్ టన్నేజ్ ధాన్యం కేటాయించగా వీరిలో కొందరు మిల్లర్లు డబుల్ టన్నేజ్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది…జిల్లాలోని ఓ 17 మంది మిల్లర్లు ఈ డబుల్ టన్నెజ్ కోసం ప్రయత్నం చేస్తుండగా వీరు ఇప్పటికే జిల్లా పౌర సరఫరాల అధికారిని ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం… ఇదే అదనుగా భావించిన ఆ అధికారి డబుల్ టన్నెజ్ కోసం ఒక్కో మిల్లర్ వద్ద నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది…అంతేకాదు మీ మిల్లు కు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయిస్తా డబ్బులు ఇవ్వండి అంటూ డి ఎస్ ఓ కొందరు మిల్లర్లకు ఫోన్ లు చేస్తూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలియవచ్చింది…ఆ 17 మంది మిల్లర్లకు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించే ఫైల్ ను సిద్ధం చేసి అప్రూవల్ కోసం ఇంచార్జ్ అదనపు కలెక్టర్ దగ్గరకు డి ఎస్ ఓ పంపగా ఆ ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది…ఐయితే ఈ 17 మంది మిల్లర్లు తమకు డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించాలని పైరవీలు సైతం బాగానే చేస్తున్నట్లు తెలిసింది…వారికి డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించాలని ఓ ఎంపీ పేషీ నుంచి ఓ అధికారికి ఫోన్ సైతం చేసినట్లు సమాచారం…కాగా జిల్లాలో ఇప్పటికి కొందరు మిల్లర్లకు అసలు ధాన్యమే కేటాయించకుండా కేటాయించిన వారికే డి సి ఎస్ ఓ ధాన్యం కేటాయించాలని చూడడం డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయిస్తా అని భరోసా ఇస్తూ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం పట్ల విమర్శలు వస్తున్నాయి….


తప్పుడు నివేదికలు…?

సివిల్ సప్లయీస్ డి సి ఎస్ ఓ ధాన్యం కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదికలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి… ధాన్యం కేటాయింపు,బి జి,టన్నెజ్,మిల్లులు సామర్థ్యం విషయం లో మొత్తం తప్పుడు సమాచారం ఇస్తూ తనను ప్రసన్నం చేసుకున్న మిల్లర్లకు గోదాం కెపాసిటీ ,,మిల్లు సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు నివేదికలు ఇస్తూ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసింది…బి జి తక్కువ గా ఇచ్చిన మిల్లులకు సైతం డబుల్ టన్నెజ్ ధాన్యం కేటాయించడానికి ఈ డి సి ఎస్ ఓ శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నతాధికారులు ఎవరు చెబితే వింటారు…ఏ ప్రజా ప్రతినిధి తో ఫోన్ చేయించాలో మిల్లర్లకు ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలిసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here