ఈరోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపోనున్నాయి…బకాయి బిల్లులు చెల్లించడం లేదని ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని కొద్దిరోజులక్రితం ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది…ఐయితే ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన నెట్‌వర్క్ ఆసుపత్రులు రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అయినా స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి… బిల్లుల పెండింగ్ తో చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….



