పేకాటరాయుళ్ల అరెస్ట్.

శాయంపేట మండల కేంద్రం లోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న శాయంపేట, ఆరేపల్లి, పత్తిపాక గ్రామాలకు చెందిన 9 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు శాయంపేట ఎస్సై జె పరమేశ్వర్ తెలిపారు.శాయంపేట గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా గ్రామంలోని గట్ల జైపాల్ రెడ్డి ఇంటి లోపల పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై పరమేశ్వర్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా పేకాట తీన్ పత్త ఆడుతూ కనిపించడంతో వారిని ఎస్ఐ పరమేశ్వర్ తన సిబ్బందితో పట్టుకునేందుకు ప్రయత్నించగా అందులో ముగ్గురు శాయంపేట గ్రామానికి చెందిన చింతల భాస్కర్,ఎండి సాదిక్ పత్తిపాక గ్రామానికి చెందిన భోగం సాంబరాజు లు పట్టుబడ్డారు.మిగతా ఆరుగురు ధైనంపల్లి సుమన్, కూతాటి రీనాకర్, ధైనoపల్లి సుమన్,ఎడ్డే రవీందర్, రాయరాకుల సుమన్,పిట్టల వికాస్ తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో 52 పేక ముక్కలు మూడు సెల్ ఫోన్లు 8 వేల 660 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని 9 మందిపై ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జె పరమేశ్వర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here