వాళ్లను క్లోజ్ చేస్తా…?

తాను ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో కాదు రాచరిక పాలనలో తాను ఓ రాజును అన్నట్లు దొర పోకడ పోతున్నాడు ఆ ఉన్నతాధికారి…జిల్లా పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి పై వార్తలు రాస్తే తన ఈగో హార్ట్ చేశారని భారీ డైలాగులతో రగిలిపోతున్నాడు…పూర్తి ఆధారాలతో వార్తలు వెలువరించిన న్యూస్10 పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు…న్యూస్10 ప్రతినిధులను క్లోజ్ చేస్తా…అంటూ అగ్గి మీద గుగ్గిలమయి పోతున్నాడు…అవినీతిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ,న్యూస్ 10 ప్రతినిధి వివరణ అడిగితే వెటకారపు మాటలు మాట్లాడిన అదనపు కలెక్టర్ వ్యక్తిగత కక్ష్యలకు దారితీస్తున్నాడు…మొన్నటికి మొన్న న్యూస్10 ప్రతినిధుల ఇంటి అడ్రస్ లు ,వివరాలు కనుక్కోండి అంటూ అసోసియేషన్ నాయకుడి కి బాధ్యతలు అప్పగించిన అదనపు కలెక్టర్…ఇప్పుడు ఏకంగా న్యూస్10 వాళ్ళను క్లోజ్ చేస్తా అంటూ కార్యాలయంలోనే ఛాలెంజ్ లు చేస్తున్నాడట….కేవలం మూడు రోజుల్లో వాళ్ల పని ఖతం అంటూ సివిల్ సప్లైస్ శాఖలో ప్రచారం సైతం చేస్తూ..న్యూస్10 కు సమాచారం ఇస్తున్నారని అనుమానంతో ఇప్పటికే అవసరం లేకున్న తన పేషీ లోని కొందరు ఉ ద్యోగులను ఉన్నపళంగా బదిలీ చేశా…ఇంకా ఎవరిపైనైనా అనుమానం వస్తే వారిని సైతం బదిలీ చేస్తా అంటూ అదనపు కలెక్టర్ అధికారిని కదా…? తన ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనపడుతుంది.. అనుమానం తో బదిలీలు చేసి పేషిని సెట్ చేశా ఇక న్యూస్10 పనిచెప్తా తాను ఉన్నతాధికారి ని కనుక తన పరపతిని వాడి ఏవైనా కేసులు బనాయించి న్యూస్10 నోరు మూయిస్తా అంటూ ఈ పనిని చేసేందుకు తనకు అత్యంత సన్నిహితుడైనా ఓ బకాయి మిల్లర్ , అసోసియేషన్ నాయకుడి పేరుతో చెలామణి అయ్యే(మిల్లర్ కాని మిల్లర్) అతగాడిని పురమాయించినట్లు తెలిసింది…

అదనపు కలెక్టర్ దొర పోకడ…

హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ దొర పోకడ పోతున్నాడు…తనపై ఉన్నతాధికారులు,మీడియా తనను ఎవరు ప్రశ్నించకూడదు,అవినీతి జరిగిన అడగకూడదు అనే ధోరణిలో ఆయన ఉన్నారు…జిల్లా పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే ఆ అధికారి కి న్యూస్10 పై ఎక్కడలేని కోపం వస్తుంది..న్యూస్10 పై నోటికి వచ్చిన భాషలో నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తా అంటూ ప్రతీకారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు…న్యూస్10 ప్రతినిధుల గూర్చి ఆరా తీస్తూ వారిని బెదిరించాలని అవసరం అయితే దాడులు చేయాలని ఓ మిల్లర్ కాని మిల్లర్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది…తన నివాసానికి సైతం వారిని పిలిపించి న్యూస్10 ను ఎలా క్లోజ్ చేద్దాం అంటూ అర్ధరాత్రి సైతం అదనపు కలెక్టర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం…

న్యూస్10 చేసిన నేరం ఏంటి….?ఈ ప్రశ్నలకు బదులేది….?

హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో అవినీతి జరుగుతోంది..సర్కార్ సొమ్ముకు గండిపడుతుంది అని న్యూస్10 చెప్పడమే న్యూస్10 చేసిన నేరమా…?ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకొని ప్రజల సొమ్ము పక్కదారి పట్టకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వార్త కథనాలు వెలువరించడమే న్యూస్10 చేసిన తప్పిదమా…?కోట్ల రూపాయలు బకాయి ఉన్న ఓ రెండు మిల్లులకు పొరుగు జిల్లా నుంచి ధాన్యం తెప్పించి కేటాయించింది నిజం కాదా…? న్యూస్10 ఈ అవినీతిని వెలికి తీస్తే అప్పటి కలెక్టర్ ప్రావీణ్య ఆ ధాన్యాన్ని తిరిగి వేరే మిల్లుకు కేటాయించి…విచారణకు ఆదేశించడం వాస్తవం కాదా…?బకాయి ఉన్న మిల్లర్ ధాన్యం తరలిపోకుండా అడ్డుకొని అధికారులను ఇబ్బంది పెడితే ఒక్క రోజు మొత్తం అధికారులు అక్కడే ఉన్నది నిజం కాదా…?స్టిక్కర్ దందా తో మిల్లర్స్ అసోసియేషన్ మిల్లర్ల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంది నిజం కాదా…?ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ వెరిఫికేషన్,స్టిక్కర్ దందా తదితర పేర్లతో దండుకుంటూ వాటాలు పంచుతుంది నిజం కాదా…?అర్ధరాత్రి వరకు వేచి ఉంటూ ఇంటికి వెళ్ళి మరి ఆ టెక్నికల్ అసిస్టెంట్ అదనపు కలెక్టర్ ను ప్రసన్నం చేసుకుంటున్నది నిజం కాదా…?తనకు హన్మకొండ జిల్లా తో ఏమాత్రం సంబంధం లేకున్నా గుట్టుచప్పుడు కాకుండా సూర్యాపేట జిల్లా డి ఎస్ ఓ హన్మకొండ కలెక్టరేట్ కు వచ్చి అదనపు కలెక్టర్ ను కలిసి కంప్యూటర్ లో ఏదో చక్కబెట్టింది నిజం కాదా….?అదనపు కలెక్టర్ సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో కోట్ల రూపాయల ధాన్యం స్కాం జరిగింది నిజం కాదా ఓ మిల్లర్ జైలుకు పోయింది వాస్తవం కాదా…?విధులను సైతం పక్కన పెట్టి అదనపు కలెక్టర్ అసోసియేషన్ నాయకుడిని అని చెప్పుకునే ఓ మిల్లర్ కాని మిల్లర్ తో తన ఛాంబర్ లో గంటల కొద్దీ భాతఖాని కొట్టేది నిజమే కదా…?న్యూస్10 కు సమాచారం ఇస్తున్నారని అకారణంగా ఓ ఇద్దరు ఉద్యోగులను తనకున్న అధికార బలంతో అదనపు కలెక్టర్ బదిలీ చేసింది నిజమే కదా…?ఇప్పటికీ తన పేషీ లో ఉన్న ఉద్యోగులను బదిలీ పేరుతో అదనపు కలెక్టర్ బెదిరించడం లేదా…?న్యూస్10 కథనాలపై రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ నివేదిక పంపమని అడిగితే ఇప్పటికీ సమాధానం పంపనిది అదనపు కలెక్టర్ కదా…?అసలు హన్మకొండ జిల్లా సివిల్ సప్లైస్ లో ఏం జరుగుతుందని…?కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే సమాధానం చెప్పలేక దీనికి కారణం న్యూస్10 అంటూ అంతు చూస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది నిజం కాదా…? జిల్లా సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అవినీతిపై న్యూస్10 ఆధారాలతో వార్తలు వెలువరించింది…తన సోర్స్ ల ద్వారా ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకొని వార్తలు వెలువరించింది తప్ప ఇవి గాలి వార్తలు ఏమాత్రం కాదు…సంబంధం లేని ప్రభుత్వ ఉద్యోగులను అనుమానంతో బదిలీ చేసిన అదనపు కలెక్టర్ మిల్లర్లను పీడిస్తూ ఫలాన పనికి ఇంత అంటూ రేట్ పిక్స్ చేసి ఓ ఇద్దరు మిల్లర్లతో రాత్రి పగలు తేడా లేకుండా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టెక్నికల్ అసిస్టెంట్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు…? ఇన్ని ప్రశ్నలకు సమాధానం న్యూస్10 ప్రతినిధి కి సరైన వివరణ ఇవ్వలేకపోతున్న అదనపు కలెక్టర్ న్యూస్10 అంతు చూస్తా…?కేసులు బనాయిస్త…?మూడు రోజుల్లో క్లోజ్ చేస్తా అంటూ ఎగిరెగిరి పడడం ఎందుకో ఆయనకే తెలియాలి…న్యూస్10 కు అదనపు కలెక్టర్ కు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమి లేవు అనే విషయం గుర్తుంచుకోవాలి…జర్నలిజం నైతిక విలువలకు కట్టుబడి ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని న్యూస్10 కొనసాగుతుంది తప్ప ఎవరి బెదిరింపులకు తల్లొగ్గదని స్పష్టం చేస్తున్నాం….న్యూస్10 ప్రతినిధులకు ఏం జరిగిన ఎలాంటి ఆపద వచ్చిన దానికి కారణం ముమ్మాటికి అదనపు కలెక్టర్,ఆ మిల్లర్ కాని మిల్లర్ ,అసోసియేషన్ నాయకుడిని చెప్పుకునే అతగాడిదే….ఉన్నతాధికారి కదా తాను చెప్పినట్లు అందరూ ఆడుతారు అనుకుంటే తప్పులో కాలేసినట్లే మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో అనేది అదనపు కలెక్టర్ గుర్తుంచుకోవాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here