బీహార్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బాలకార్మికులను పనికోసం తీసుకువస్తున్న టేకేదార్ రంగేలా హుటాహుటిన హన్మకొండ జిల్లా కొత్తగట్టు లేయర్ పౌల్ట్రీ పామ్ కు చేరుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టాడు… నష్ట నివారణ చర్యలు అంటే బాల కార్మికులు లేరు అని నిరూపించడానికి ఎం చేయాలి…? తనిఖీకి అధికారులు వస్తే ఫామ్ లో పనిచేస్తున్న బాల కార్మికులను హుటాహుటిన ఎక్కడికి ఎలా తరలించాలి…? అని టేకేదార్ రంగేలా, పౌల్ట్రీ యజమాని తెగ ఆలోచనలు చేసినట్లు తెలిసింది… న్యూస్ 10 లో పౌల్ట్రీ పై కథనాలు వ స్తున్నాయి కనుక న్యూస్10 ప్రతినిధిని పౌల్ట్రీ ఫాం కు పిలిచి బెదిరిద్దామని పౌల్ట్రీ యజమాని ఓ పనికిమాలిన ఆలోచన చేసినట్లు తెలిసింది… తాటాకు చప్పుళ్లకు న్యూస్10 బె దురుతుందని,ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణాలో పౌల్ట్రీ పెట్టి బాలకార్మికుల తో ఫాం నడుపుతున్న సదరు యజమాని పగటి కలలు కంటున్నట్లు విశ్వసనీయ సమాచారం… కాగా మీ వద్దకు పంపిన బాల కార్మికులను ఎవరి కంట పడకుండా చూడలేదు, వారిని తీసుకువెళ్తా అని టేకేదార్ రంగేలా పౌల్ట్రీ యజమాని తో గొడవకు దిగినట్లు తెలిసింది..అంతేకాదు బీహార్ నుంచి బాలకార్మికులను తెస్తు వారిని వివిద చోట్లలో పనిలో పట్టిన టేకేదార్ రంగేలా న్యూస్10ప్రతినిధికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు… మేం అధికారులకు అందరికి డబ్బులు ఇస్తున్నాం రాయడానికి మీరెవరు..? అంటూ అర్ధం పర్థం లేని ప్రశ్నలతో బెదిరించే ప్రయత్నం చేసాడు… టేకేదార్ రంగేలా కు తోడుగా పౌల్ట్రీ యజమాని తరపున వకాల్తా పుచ్చుకొని ఓ సూపర్ వైజర్ సైతం ఫోన్ చేసి న్యూస్10 ప్రతినిధిని బెదిరించే ప్రయత్నం చేసాడు… మా ఓనర్ చెప్పాడు.. మా ఓనర్ కోసం ఎంతకైనా తెగిస్తా అవసరం ఐతే జైలు కు పోత అంటూ అతిగా మాట్లాడాడు…ఇదిలావుంటే బీహార్ కు చెందిన టేకేదార్ రంగేలా కొత్తగట్టు కు వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఇతగాడే బాలకార్మికులను బీహార్ నుంచి తీసుకువస్తున్నాడని తెలిసిన అధికారులు మాత్రం చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి…
ఇవిగో సాక్ష్యాలు…!
మరో సంచికలో



