భారతి స్కూల్ అనుమతుల మాయజాలం…?

వరంగల్ జిల్లాలోని వరంగల్ కొత్తవాడలో నిర్వహిస్తున్న భారతి స్కూల్ అనుమతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అధికారిక డాక్యుమెంట్లు, స్థల పరిస్థితులు, ప్రచారం లో ఉన్న వివరాల మధ్య స్పష్టమైన తేడాలు బయటప డటంతో అనుమతుల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల నిర్వహణ జరుగుతున్న ప్రదేశం కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు తెలు స్తుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. విద్యాసం స్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమా ణాలు పూర్తిగా ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.డాక్యుమెంట్ల పరిశీలనలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసి తరువాత అనుమతులు, ఎన్ ఓ సి లు పొందాల్సి ఉండగా, ఈ కేసులో మాత్రం ముందుగానే ఎన్ ఓ సి వచ్చినట్లు, అనంతరం దరఖాస్తు చేసినట్లు నమోదులు కనిపించడం వివాదానికి దారి తీస్తోంది. ఈ క్రమం అధికారిక విధానాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో కూడా లోపాలు ఉన్నట్లు అధికారులే ఇచ్చిన నివేదికల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ముఖ్యంగా విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని నివేదికలో ఉన్నప్పటికీ, అదే పాఠశాలకు అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిల్లల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి లోపాలను ఎలా నిర్లక్ష్యం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాల పేరు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. అధికారిక అనుమతులు భారతి స్కూల్ పేరుతో ఇచ్చినప్పటికీ, ప్రచారంలో మాత్రం భారతి పబ్లిక్ స్కూల్ అనే పేరును ఉపయోగించడం గమనార్హం. ఇదే సమయంలో సిలబస్ విషయంలో కూడా భిన్నతలు కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం స్టేట్ సిలబస్ కు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, బయట ప్రచారంలో మాత్రం సిబిఎస్ఈ పాఠశాలగా పేర్కొనడం తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే చర్యగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని లోపాలు, విభిన్నతలు బయటపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మౌనం వహించడం విమర్శలకు దారి తీస్తోంది. పిల్లల భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here