మానుకోట జిల్లాలో మైనింగ్ ఏడీ వెంకట రమణ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాల్సిన సదరు అధికారి తన విధుల పట్ల పూర్తి అలసత్వం ప్రదర్శిస్తూ అక్రమార్కులకు బాగానే సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా పత్రికల్లో వరుస కధనాలు వచ్చినా తనకేమీ పట్టనట్లు ఐ డోంట్ కేర్ అంటూ ప్రవర్తిస్తూ ఎవరికి స్పందించకపోవడమే తన విధిగా భావిస్తున్నాడు.జిల్లాలో అరకొర అనుమతులతో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతు పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతు ప్రభుత్వ ఖజానాకు అక్రమార్కులు భారీగా గండి కొడుతున్నారు.వాల్టా చట్ట నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్ధాలను వినియోగిస్తూ చుట్టుపక్కల జలాశయాల కాలుష్యనికి కారకులు అవుతున్నారు.అంతే కాదు ఓవర్ లోడ్ కలిగిన భారీ సైజు బండరాళ్లను సైతం లారీల్లో రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దులు దాటిస్తూ అక్రమార్కులు కోట్లల్లో ఆదాయం పొందుతున్నారు. అంతా తెలిసిన మహబూబాబాద్ మైనింగ్ శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటంలేరన్న విమర్శలు లేకపోలేవు.ముఖ్యంగా కేసముధ్రం,తొర్రురు మండలాల్లో గ్రానైట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.కట్రాపల్లి గ్రామంలో పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ చేస్తూ చుట్టూ సమీప గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనింగ్ అధికారులకు పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తుంది.తొర్రురు మండలంలోని కంఠయాపాలెం రెవెన్యూ పరిధిలోని రెండు గ్రానైట్ క్వారీల యజమానులు కెమికల్ ద్వారా నిర్వహించిన బ్లాస్టింగ్ నీటిని శుద్ధి చేయకుండా సమీపంలో చెరువులోకి వదులుతూ కాలుష్యానికి కారకులు అవుతున్నారు.వేచి చూడాలి మరి ఇప్పటికైనా మైనింగ్ ఏ డీ నిజాయితీతో తన విధులు నిర్వహిస్తాడో లేక ప్రభుత్వ జీతం పొందుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తాడో చూడాలి మరి …



