మార్కెట్ లో బాటిళ్ల మాయ

బహిరంగ మార్కెట్ లో బాటిళ్ల మాయ సాగుతుంది.. మార్కెటింగ్ కోసం అడ్డగోలు ధరలతో కొన్ని కంపెనీలు దందా నడుపుతున్నాయి…గంపగుత్త గా కొనుగోలు చేసే వారికోసం ఈ కంపెనీలు తమకు తోచిన ఆపర్ ఇస్తున్నాయి….ఆ బాటిళ్లపై ఎంత కావాలంటే అంత ముద్రించి ఇస్తున్నారు… ఎం ఆర్ పి ముద్రించే పని అయిపోయింది ఇక మీరు వ్యాపార దోపిడీకి తెర తీయండి అన్నట్లు కావాల్సిన వ్యాపారులకు ఆ బాటిళ్లను అందిస్తున్నారు… ఇంకేముంది ముద్రించిన అడ్డగోలు ధరలతో ఎం ఆర్ పి కే అమ్ముతున్నాం అని సన్నాయి నొక్కులు నొక్కుతూ వ్యాపారులు బాటిళ్లను అమ్మేస్తున్నారు…

వాటర్ బాటిళ్ల దందా!

తెలంగాణ వ్యాపారం విస్తరించి తమ వాటర్ బాటిళ్లను ఎక్కువగా విక్రయించి కోట్లు కోళ్లగొట్టేందుకు ఓ వాటర్ కంపెనీ భారీ స్కెచ్ వేసింది… మార్కెట్ ల తమ కొనుగోలు వాటా పెంచుకునేందుకు వాటర్ బాటిల్లు అమ్మే వాళ్లు ఏది చెపితే అది వినేందుకు అ వాటర్ కంపెనీ సిద్ధం ఐయింది… అందులో భాగంగా వాటర్ బాటిల్లు కొనుగోలు చేసి వ్యాపారం చేసే వారికోసం వారు అడిగిన ధరలు ముద్రించి ఇస్తుంది… ఒక బాటిల్ ధర ఒకే కంపెనికి చెందిన బాటిల్ ధర ఒక్కో రకంగా కనిపిస్తుంది.. సాధారణంగా వాటర్ బాటిల్ల ధరలు అన్ని ఒకేరకంగా లీటర్ బాటిల్ ధర రూ 20 రూపాయలు ఉండగా ఆ కంపెని బాటిల్ పై మాత్రం 20,30 అంటూ రకరకాల ధరలు దర్శనం ఇస్తున్నాయి… ఎవరు కోరిన ధరలు వారికి ముద్రించి ఇస్తూ బహిరంగ మార్కెట్ లో అయోమయం చేస్తున్న దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు…. మార్కెటింగ్ కోసం వాటర్ బాటిళ్ల కంపెనీ ధరల మాయ చేస్తున్న ఏమాత్రం పట్టింపు లేనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది… మార్కెటింగ్ కోసం రకరకాల ధరలతో బాటిల్లు అమ్మడం పలు అనుమానాలకు తావిస్తుంది…

అవును ఆ నీళ్ల కంపెనీ అంతే…?

హన్మకొండ బస్ స్టాండ్ లో బాటిళ్ల మాయ

మరో సంచికలో….

మార్కెట్ లో బాటిళ్ల మాయ- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here