హనుమకొండ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల విచ్చలవిడితనం ఎంతగా ఉన్న ఏమాత్రం పట్టించుకోకుండా మాకేం సంబంధం అన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు వ్యవహారిస్తున్నట్లు కనపడుతుంది…ఇరుకు సందుల్లో కాసింత జాగా దొరికిన అదే జాగలో వెంటనే ఓ బోర్డు పాతి ఆస్పత్రిని స్థాపించి ఇరుకు గదుల్లో సూపర్ స్పెషాలిటీ అని చెప్పిన అధికారులు మాత్రం ఇదేంటి.. ఇది ఆస్పత్రా…? అని ప్రశ్నించడం లేదు…మున్సిపల్ వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలను గాలికి వదిలి, నిబంధనలకు విరుద్దంగా రోగులనుండి విచ్చలవిడిగా కార్పొరేట్ వైద్యం పేరుతో వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్న అధికారులు జానేదో అన్నట్లు ప్రవర్తిస్తున్నట్లు కనపడుతుంది . హన్మకొండ బస్టాండు సమీపంలోని కుడా కాంప్లెక్స్ కు పక్కనే ఉన్న సస్య హాస్పిటల్ సర్కార్ నిబంధనలకు విరుద్ధం గా కొనసాగుతున్న అధికారులు ఇప్పటివరకు ఆ ఆసుపత్రి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు… దింతో అధికారుల తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్న భవనం నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు…మున్సిపల్ శాఖ నుండి భవన నిర్మాణానికి రెసిడెన్షియల్ అనుమతి పొందిన సదరు బిల్డింగ్ యజమాని దర్జాగా కమర్షియల్ వ్యాపారం నిర్వహిస్తున్న మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న మున్సిపల్ అధికారులు గమ్మున ఉన్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి… వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మస్కా కొట్టి ఏకంగా ఓ ఆసుపత్రినే ఈ భవనం లో ప్రారంభించిన ఎలాంటి పార్కింగ్, అంబులెన్స్ దారి లేకపోయినప్పటికీ రోడ్లపైనే పార్కింగ్ చేస్తూ అటుగా
ప్రయాణికులను, వాహనదారులను తీవ్రంగా ఇబ్బందుల గురి చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు… ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలాలు లేకుండా కమర్షియల్ గా నడిపే ఏ వ్యాపార సంస్థకు కూడా అనుమతి ఇచ్చేది లేదంటూ ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రకటనలు ఇచ్చినప్పటికీ అవేమీ పట్టనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి…
అంతేకాకుండా రోడ్లపైనే విచ్చలవిడిగా రోగులు తమ వాహనాలను నిలిపినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు కూడా వారిపై ఎలాంటి చర్యలకు సిద్ధపడకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మున్సిపల్ నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ లేకున్నా నిర్మాణం పూర్తి చేశారని ఆరోపణలు ఉన్నా,టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు…పేక మేడ లాంటి ఈ భవనంలో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే కనీసం
చుట్టూ ఫైర్ ఇంజన్ లాంటి వాహనం వెళ్లడానికి కూడా వీలులేని విధంగా ఉంది అలాంటి భవనం కళ్ళముందు కనపడుతున్న మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం తెర వెనకాల ఎదో జరిగిందనే అనుమానాలు బల పడుతున్నాయి. మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలను తుంగలో తొక్కి దర్జాగా వైద్య వ్యాపారాన్ని మొదలుపెట్టిన సస్య ఆసుపత్రి పై అధికారులు ఎలాంటి చర్యలకు సిద్ధపడుతారో చూడాలి…



