మెస్సి తో ఫొటోకు రూ 10 లక్షలు

ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి తో ఫోటో దిగాలని ఉందా.. ఐయితే మీరు పది లక్షలు చెల్లించి మెస్సి తో ఫొటోకు పోజు ఇవ్వొచ్చు…శుక్రవారం హైదరాబాద్ కు వస్తున్న మెస్సి తో ఫోటో దిగడానికి నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు… మీరు ఆలస్యం చేశారో ఈ అవకాశం మీకు దక్కదు ఎందుకంటే ఇలా రూ పది లక్షలు చెల్లించి ఫోటో దిగే అవకాశం కేవలం 100 మందికి మాత్రమేనని నిర్వాహకులు ప్రకటించారు..ఈ నెల 13వ తేదీన ది గోట్ టూర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మెస్సీతో, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు…సీఎం రేవంత్ రెడ్డి తో సైతం మెస్సి ప్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు..ఈ నేపధ్యంలో మెస్సీతో ఫోటో కావాలంటే రూ.9.95 లక్షలు(+ GST) చెల్లించాలని, కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీ రెడ్డి తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here