తెలంగాణ రవాణా శాఖలో మల్టీజోన్-I, మల్టీజోన్-II పరిధిలో పనిచేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (MVIలు), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (AMVIలు) బదిలీ అయ్యారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ & రోడ్డు రవాణా అథారిటీ కమిషనర్ డా. కె. ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, శాఖ పనితీరు మెరుగుదల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.







