వసూల్ రాజాలను ఆపేదెవరు…?

అక్రమ వసూళ్ల తతంగం నడిస్తే తప్ప మహబూబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో పనులు జరిగేలా లేవు… ఇక్కడ జరుగుతున్న అవినీతి వసూళ్లపై న్యూస్ 10 కథనాన్ని వెలువరించగా బుధవారం పత్తా లేకుండా పోయిన ఏజెంట్లు, బ్రోకర్లు మళ్లీ అదే పనిని యధావిధిగా కొనసాగిస్తున్నారు… ఈసారి కాస్త గుట్టుగా వచ్చిపోయే వాళ్లను నిశితంగా గమనిస్తూ తమ పనిని కొనసాగించారు…అధికారుల కోసం,అధికారుల ఆదేశాల ప్రకారం అందినకాడికి వాహనదారుల వద్దనుంచి వసూలు చేస్తూ గురువారం వసూళ్ల పర్వాన్ని నిరాటంకంగా కొనసాగించారు…రవాణా శాఖ కార్యాలయం పరిధిలోని షాపుల చాటుగా,కనిపించకుండా చెట్ల మధ్యన ఉండి గుట్టుచప్పుడు కాకుండా వసూళ్ల దందా కొనసాగించారు ఏజెంట్లు,బ్రోకర్లు

ఎంవీఐ లకు వారే ఆమ్దాని…?

మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఓ ముగ్గురు ఏజెంట్లు మధ్యవర్తులుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురి ఏజెంట్లు నిత్యం ఎం.వి.ఐ లతో టచ్ లో ఉంటూ పనుల కార్యక్రమాన్ని చక్కబెడుతున్నట్లు సమాచారం మీరు చెప్పింది చెప్పినట్లు ఆచరించే ఈ ఏజెంట్లు వసూల్ చేసిన సొమ్మునంత సాయంత్రం కాగానే అధికారులకు పువ్వుల్లో పెట్టి మరి అప్పగిస్తున్నట్లు తెలియ వచ్చింది.మీరు చెప్పినట్లుగానే ఆ ఏజెంట్లు ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్ చేసి ఏ పనినైనా అవలీకలగా చేసి పెడుతూ డబ్బులు దండుకుంటున్నట్లు తెలిసింది.దండుకున్న డబ్బుల్లో వాటాల ప్రకారం ఎంబీఏ లకు డబ్బులను గుట్టు చప్పుడు కాకుండా అప్పజెప్పి మిగతాది కమిషనర్ రూపంలో ఏజెంట్లు దండుకుంటున్నట్లు తెలియవచ్చింది. అధికారుల ప్రోత్సాహం కారణంగానే ఈ ఏజెంట్లు తమ దగ్గరికి వచ్చిన వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేసి సదరు ఎంవీఐలకు సాయశక్తుల సహకరిస్తున్నట్లు రవాణాశాఖ కార్యాలయంలో టాక్ నడుస్తోంది. అధికారితో పాటు ఈ ఏజెంట్ సైతం ఆర్థికంగా బాగానే బలపడినట్లు అక్కడివారు చెబుతున్నారు.. ఇక్కడి అధికారులు తమ చేతులకు అవినీతి తడి అంటకుండా ఏజెంట్ల ద్వారా వసూళ్లు చేసి వారి వాటాను వారు సింహ భాగం నొక్కేస్తున్నట్లు తెలిసింది….ఇలా అధికారుల ఆదేశాలతో వసూళ్లు మొదలుకొని వాటాలు పంచేవరకు ఏజెంట్లు అన్ని చక్కబెడుతుండడంతో ఒక్కో అధికారి ఒక్కో ఏజెంట్ ను తమ మధ్యవర్తిగా నియమించుకుని సుద్దపూస మాటలతో బురిడి కొట్టిస్తున్నట్లు తెలుస్తుంది….అధికారులకు సాయంత్రం కాగానే వసూలు చేసింది అప్పగించాలి కనుక ఏజెంట్లు,కొందరు హోం గార్డ్ లు వసూళ్ల వేధింపులతో వాహనదారులకు పట్టపగలే “చుక్క”లు చూపిస్తున్నట్లు సమాచారం….కాగా ఇక్కడి కార్యాలయంలో జరిగే పనిని బట్టి పదిహేను వందల రూపాయలు మొదలుకొని ఎనిమిది వేల వరకు వీరు కమీషన్ పిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది…అంతేకాదు ఎవరైనా ఇంతగా వసూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తే కార్యాలయం లోపల సార్లు కమీషన్ రేటు పెంచారని సర్దిచెబుతు వాహనదారుల ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి..

ఇది మనకు మామూలే…?

మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కొందరు అధికారులకు మధ్యవర్తులుగా ఉంటూ వసూళ్లు చేసి వాటాలు పంచుతున్న ఏజెంట్లు న్యూస్10 కథనంతో అలెర్ట్ అయ్యి వసూళ్ల పంథాను మార్చాలని వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిసింది..రవాణా శాఖ కార్యాలయం వద్ద మొత్తం ఐదుగురు ఏజెంట్లు ఉండగా వీరికి ఓ ఏజెంట్ లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…తతంగం అంతా నడిపిస్తూ రింగ్ మాస్టర్ లా వ్యవహరించే ఇతగాడు డోంట్ వర్రీ అంటూ మిగతా ఏజెంట్లకు ధైర్యం చెబుతున్నట్లు తెలిసింది…ఎవరికి కనపడకుండా అధికారులకు టచ్ లో ఉంటూ వసూళ్ల భాగోతం నడిపే ఇతగాడు బాగానే వెనకేసినట్లు ప్రచారం సాగుతోంది…అధికారులకు ఈ బడా ఏజెంట్ ఎంత చెబితే అంతలా కార్యాలయంలో పనులు నడుస్తాయి. అంటే అతగాడు పరపతి ఏంటో అర్థం చేసుకోవచ్చు…అక్రమ వసూళ్లలో ఆరితేరిన ఇతగాడు అన్ని నేను చూసుకుంటా ఏం కాదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు న్యూస్10 దృష్టికి వచ్చింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here