రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రేట్ల రాజ్యం…?
పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ‘సెట్టింగ్’ రాజ్యం..?
ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ దే అసలు చేతివాటమా..?
డాక్యుమెంట్ రైటర్ల ద్వారా నడుస్తున్న వసూళ్ల దందాపై ఆరోపణలు
అడిగింది సమర్పించకుంటే పని జరగదనే విమర్శలు..
కార్యాలయంలో ఓ డాక్యుమెంట్ రైటర్ హవా..?
ఏసీబీ దాడులు జరుగుతున్న మారని పరిస్థితులు..
వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారిక ఫీజులకు మించి భారీగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డాక్యుమెంట్ రైటర్లు ‘వసూల్ రాజాల’ అవతారం ఎత్తి కార్యాలయంలో హవా నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చే ప్రజల నుంచి వివిధ పేర్లతో డబ్బులు వసూలు చేసి, అవి నేరుగా ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్‌కు చేరుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. “అడిగింది సమర్పించకుంటే పని జరగడం అసాధ్యం” అనే పరిస్థితి నెలకొన్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
కార్యాలయంలో ఓ డాక్యుమెంట్ రైటర్ స్వేచ్ఛగా తిరుగుతూ మొత్తం వ్యవహారాన్ని ప్రభావితం చేస్తున్నాడని, అతని అనుమతి లేకుండా ఫైల్ కదలదనే స్థాయిలో పరిస్థితి ఉందన్న ప్రచారం జరుగుతోంది.ఓ వైపు అంతటా ఏసీబీ దాడులు జరుగుతున్నా… ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న ఈ వసూళ్ల వ్యవహారంపై న్యూస్ 10 పూర్తి విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో



