“అధికార హోదా ఒక చేతిలో… కాంట్రాక్టు వ్యవహారాలు మరో చేతిలో…! హన్మకొండ సివిల్ సప్లై శాఖలో ఓ జిల్లా స్థాయి అధికారి ద్విపాత్రాభినయం ఇప్పుడు సంచలనంగా మారింది. బిల్లుల క్లియరెన్స్ నుంచి దాన్యం రవాణా కాంట్రాక్టుల వరకు అన్నింటిపైనా తన ప్రభావం చూపిస్తున్నాడన్న ఆరోపణలు శాఖలో కలకలం రేపుతున్నాయి. బినామీలతో కాంట్రాక్టులు నడిపిస్తూ… టెక్నికల్ అసిస్టెంట్ల అండతో ‘మహేంద్రజాలం’ ప్రదర్శిస్తున్నాడన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.”
హన్మకొండ సివిల్ సప్లై శాఖలో ఓ జిల్లా స్థాయి అధికారి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార హోదాలో ఉండాల్సిన వ్యక్తి… బినామీల ద్వారా దాన్యం రవాణా కాంట్రాక్టుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బిల్లుల క్లియరెన్స్‌లో ప్రభావం చూపించడం నుంచి… టెక్నికల్ అసిస్టెంట్ల సహకారంతో శాఖలో తనదైన “మహేంద్రజాలం” నడిపిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పాత బినామీని తప్పించి కొత్త వ్యక్తితో రంగంలోకి దిగాడన్న సమాచారం కూడా వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఈ వ్యవహారంలో ఉన్న అసలు కథ ఏంటి…? ఆ అధికారి వెనుక ఉన్న బలగాలు ఎవరు…? శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై పూర్తి ప్రత్యేక కథనం “న్యూస్10” సంచికలో…



