తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగులాంబ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు 970కి చేరాయి. ఇవాళ ఉదయం ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 25కి చేరినట్లు ఈటల వెల్లడించారు. ఇవాళ డిశ్చార్జ్‌ అయిన 58 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 262 మంది డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. మరో 693 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. వాటిలో అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈటల వివరించారు.

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు- news10.app

రాష్ట్రంలో టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈటల తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠి కమాండ్ కంట్రోల్‌ రూంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

దేశవ్యాప్త మరణాల రేట్‌ (3.1%)తో పోల్చితే తెలంగాణ (2.6%) మెరుగైన స్థానంలో ఉందన్నారు. రికవరీ రేట్‌ కూడా దేశవ్యాప్త (19.9%) సగటుతో పోలిస్తే తెలంగాణ (22%) మెరుగైన స్థానంలో ఉందని ఈటల వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here