31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఈనెల 31 నుంచి ఆస్పత్రుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి…పెండింగ్ బకాయిల విషయంలో ఆలస్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది…ఉద్యోగ, జర్నలిస్టు ఆరోగ్య వైద్య సేవలు కూడా నిలిపివేయనున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది..ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన హాస్పిటల్స్ అసోసియేషన్ ,.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య బిల్లుల బకాయిలు పెండింగ్  ఉండగా, దీంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం పెరిగిపోతుందని, చిన్న ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి వచ్చిందని హాస్పిటల్ యాజమాన్యాలు ఆవేదనవ్యక్తం చేస్తున్నాయి..కాగా సర్కార్ తో జనవరిలో చర్చలు జరగగా నాలుగు నెలల్లో బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పినా, ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని టీఏఎన్‌హెచ్ఏ తెలిపింది..ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి నుండి అన్ని ఆరోగ్యశ్రీ, ఉద్యోగ, జర్నలిస్టు వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here