వరంగల్ జిల్లా నర్సంపేటలోని వినాయక ఉత్సవ కమిటీ, ముస్లిం కమిటీ సభ్యులతో గురువారం నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ సహృద్బావ ప్రశాంత వాతావరణం లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. వినాయక చవితి మండపాల అనుమతికి సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో నర్సంపేట టౌన్ సిఐ రఘుపతి రెడ్డి, ఎస్సై లు రవికుమార్, అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.



