హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది ..హనుమకొండలోని కిషన్ పుర లో ఉన్న ఈ కళాశాలలో సుమారు 25 మంది విద్యార్థులకు పుడ్ పాయిజన్ ఐయినట్లు సమాచారం… మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత విద్యార్థులు కడుపునొప్పితో అస్వస్థతకు గురికాగా ఆలస్యంగా స్పందించిన కళాశాల యాజమాన్యం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.. ప్రస్తుతం వీరిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.. ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంలో ఆలస్యం చేసినట్లు తెలియ వచ్చింది.. కళాశాలలోని ఫుడ్ మూలంగానే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసింది…



