మా సారు తోపు

మాసారు తోపు, మాసారు గ్రేట్

పి సి సి ప్రెసిడెంట్

మున్సిపల్ చైర్మన్

కుడా ఛైర్మెన్

హన్మకొండ ను అభివృద్ధి చేసిందే మాసారు

వై యస్ కు బాగా దగ్గర…


36 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న


మా సారుకు తెలిసిన దాంట్లో వెంట్రుక మందం కూడా మీకు తెలియదు..


ప్రెస్ వాళ్ళు అందరూ నాకు తెలుసు
రెగ్యులర్ గా నేను వాళ్లకు కాంటాక్ట్ లో ఉంటా…


ప్రెస్ గ్రూపులో నేను ఉంటా…ఇగ జూడు మన ప్రెస్ క్లబ్ కామ్రేడ్స్ గ్రూప్


మీ సార్ ఎందుకు పంపిండో నాకు తెలుసు…
45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మా సారు గోడౌన్ ఫోటో వేస్తారా…అధికారులకు తెలియదా…?అందరూ మాకు దగ్గరే…..


ఇవి నివాస ప్రాంతాల మధ్య గ్యాస్ గోడౌన్ నడుపుతున్న యజమాని మేనేజర్ మాట్లాడుతున్న బరితెగింపు మాటలు…వివరణ కోసం పోతే ఎందుకు వచ్చారో తెలుసు అని పనికి మాలిన మాటలు మాట్లాడి నోరు పారేసుకున్న తీరు…వాళ్ళ సారు ఈ ప్రపంచ రాజకీయాలు నడిపినట్లు ఆయన రాజకీయ చతురత వల్లే హన్మకొండ నగరంలో జనం అంత బతికి బట్ట కడుతున్నట్లు సెల్ఫ్ డబ్బా మాటలు…ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నివాస ప్రాంతాల మధ్య గ్యాస్ గోడౌన్ నడుపుతూ బెదిరిస్తే బెదిరిపోతారు…తాటాకు చప్పుళ్లకు అదిరిపోతారని హన్మకొండ హంటర్ రోడ్ లోని శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ వెంకటేశ్వర్లు తన అపర మేధావి తనాన్ని ప్రదర్శించాడు…అధికారులందరు మా సారుకు బాగా దగ్గరే అంటూ ఎక్కడ లేని బిల్డప్ కొట్టాడు… ఇలా రాయండి అలా రాయండి అంటూ సూచనలు చేసాడు…అందరితో లింకులు ఉంటాయి.. మా బాస్ గురించి మీకు తెలియదు అంటూ వీర లెవల్లో న్యూస్10 ప్రతినిధికి క్లాస్ పీకాడు మేనేజర్ వెంకటేశ్వర్లు …. మేనేజర్ వెంకటేశ్వర్లు లాంటి వారి బెదిరింపులకు,వాళ్ళ బాస్ ఫ్లాష్ బ్యాక్ లకు న్యూస్10 ఏమాత్రం బెదిరిపోదు…ఇవన్నీ పక్కన పెడితే నివాస ప్రాంతాల మధ్య అసలు గ్యాస్ గోడౌన్ ఎందుకు నిర్వహిస్తున్నారో…?చెప్పాలి…వెనుకటికి మా తాత ఎల్ల గుర్రం ఎక్కాడు ఎదో కాయ కాసింది అనే కథలు మాకు అవసరం లేదు…పనికి మాలిన మాటలు పక్కన పెట్టి సమాధానం చెప్తే చాలు…

శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ  కథేంటి….?

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here