మంత్రి మా చుట్టమే అని చెప్పుకునే ఈ ఇద్దరు మిల్లర్స్ తోటి మిల్లర్స్ దగ్గరనే టోకెన్ పేరుతో బాగానే దండుకునేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది… మంత్రి ఉండగా నాకేం కాదు అధికారులందరు నా జేబు లోనే అని బిల్డప్ కొట్టే మిల్లర్ ఒకరు…సర్కార్ కు కోట్ల రూపాయలు బకాయి పడి అసోసియేషన్ రూపంలో పెత్తనం చేస్తున్న మిల్లర్ ఇంకొకరు…ఈ ఇద్దరు కలిసి తోటి మిల్లర్ల వద్ద నుంచి టోకెన్ అంటూ స్టిక్కర్ పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి..”కంచే చేను మేసిన”.. చందాన ఆపద వస్తే మిల్లర్స్ ను కాపాడాల్సిన ఆ ఇద్దరు మిల్లర్స్ టోకెన్ పేరుతో తోటి మిల్లర్స్ ను పిండి పిప్పి చేస్తున్నట్లు సమాచారం…డబ్బు బలం,రాజకీయ పలుకుబడి ఉంటే ఏదైనా చేయోచ్చు ఎవరిని లెక్క చేయాల్సిన పని లేదు అనే బరితెగింపుతో వసూళ్లు చేస్తున్న ఈ ఇద్దరు మిల్లర్స్ వ్యవహారం ఇప్పుడు వారి అసోసియేషన్ లోనే హాట్ టాపిక్ గా మారింది…రబీ,ఖరీఫ్ ఇలా కాలం ఏదైనా ధాన్యం సీజన్ వస్తే చాలు టోకెన్ స్టిక్కర్స్ వసూళ్ల తో మిల్లర్స్ కు చుక్కలు చూపెడుతున్న ఆ ఇద్దరు అసోసియేషన్ నాయకుల స్టిక్కర్ దందా పై న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో….



