పేరులోనే షైనింగ్

రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియకుండానే ప్రయివేటు విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను మొదలుపెట్టాయి. గత కొద్దిరోజుల క్రితం వెలుబడిన టెన్త్ ,ఇంటర్,ఎప్ సెట్ ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఎరగా చూపి మాయమాటలు చెప్పి వారిని తమ విద్యా సంస్థల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు.రంగురంగుల కరపత్రాలు ఆకర్షణీయమైన ప్రకటనలతో ఉదర కొడుతూ వారిని బురిడీ కొట్టించి కార్పొరేట్ విద్య పేర విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హైదరాబాద్ నగరం తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో రెండవ ఎడ్యుకేషన్ హబ్ గా పేరొందిన వరంగల్,హన్మకొండ,కాజీపేట త్రినగరిలో కార్పొరేట్ విద్యా మాఫియా రెచ్చిపోతుంది.
సరిగ్గా ఇదే కోవాకు చెందింది నగరంలో విద్యా వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్న షైన్ విద్యా సంస్థలు.జిల్లాలో ఏ విద్యా సంస్థ సాధించని ర్యాంకులు కేవలం షైన్ విద్యా సంస్థ విద్యార్థులకే సాధ్యం అంటూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వారి నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు నగరవాసులు నుండి వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఐఐటీ,జేఈఈ, మెడికల్ ఫౌండేషన్ అంటూ అదనంగా వేలల్లో వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అదించాలంటే ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నగరంలో విద్యా శాఖ అనుమతులకు విరుద్ధంగా విచ్చలవిడిగా బ్రాంచీలు ప్రారంభించి తమ విద్యా వ్యాపారాన్ని అడ్డగోలుగా కొనసాగిస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేవు.అంతేకాకుండా వారు లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థల్లో అర్హత, అనుభవం లేని అధ్యపకులతో తూతుమంత్రంగా సిలబస్ పూర్తి చేసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఎలా సాధ్యం అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పైగా ప్రభుత్వం నుండి అనుమతులు పొందే సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పించిన పత్రాల్లో ఉన్న ఏలాంటి సౌకర్యాలు వారి పాఠశాలల్లో కానరాక పోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇరుకు గదులు
,రేకుల షెడ్డులే డిజిటల్ క్లాస్ రూమ్ లు అంటూ తల్లిదండ్రులకు మస్కా కొడుతూ వారి ఏసీ, నాన్ ఏసీ, రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ పేర వారిని నిలువునా దగా చేస్తూ ఫీజుల కోసం వేధింపులకు దిగుతున్న కార్పొరేట్ విద్యా వ్యాపారులపై అధికారులు ఈ విద్యా సంవత్సరం ఎలాంటి చర్యలకు సిద్ధపడుతారో వేచి చూడాలి మరి….

నగరంలో గత కొన్నేళ్లుగా నిర్విరామంగా కార్పొరేట్ విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడి చేస్తున్న విద్యా సంస్థలపై న్యూస్ 10 వరుస కథనాలు…త్వరలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here