హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఓ ఉన్నతాధికారి దొర పోకడ పోతున్నాడు…తాను ఉన్నత వర్గానికి చెందిన వాడినని అందరిని పురుగు లాగే చూస్తూ ఎవరిని బడితే వారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన నోటికి పని చెబుతున్నాడు…తన పై అధికారులను కూడ లెక్కచేయకుండా తనకు తోచింది తోచినట్లు చేసేస్తున్నట్లు విమర్శలు సైతం ఉన్నాయి….సూర్యాపేట నుంచి బదిలీపై హన్మకొండకు వచ్చిన ఈ సారు తనకున్న అధికారంతో కావాల్సినంత వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఓ మిల్లర్ సహకారంతో ఈ ఉన్నతాధికారి అందినంత దండుకొని ఎం తెలియనట్లు నీతి వాక్యాలు వల్లెవేస్తూ తన అంత నీతిమంతుడు లేడు అన్నట్లు ఇతరులకు ఉపదేశాలు ఇస్తున్నాడు….
న్యూస్10 పై చిర్రుబుర్రు…
హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి ఆ శాఖ జిల్లా అధికారి వ్యవహరిస్తున్న తీరు…ఓ మిల్లర్ అతి తెలివితేటలపై న్యూస్10 వరుస కథనాలు వెలువరించగా అలా అవినీతి పై వార్తలు రాయడం ఉన్నతాధికారి, సివిల్ సప్లయీస్ వ్యవహారాలు చూసే హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ కు ఏమాత్రం నచ్చలేదు…న్యూస్10 లో కథనాలు మొదలుకాగానే సెలవు పెట్టి ఓ నాలుగు వారాలు ఎదో దేశం వెళ్లిన అదనపు కలెక్టర్ రాగానే ఆ కథనాల గూర్చి తెలుసుకొని న్యూస్10 పై తన అక్కసు వెళ్లగక్కాడు… ఓ మిల్లర్ కు ఆదనపు ధాన్యం కేటాయింపు,ఫిజికల్ వెరిపీకేషన్ విషయంలో వివరణ కోరితే న్యూస్10 ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు…అసలు విచారణ చేయం ఏంటి…ఇక వెల్లు అంటూ తన ఇంటి మనిషికి ఎదో జరిగినట్లు పరోక్షంగా మిల్లర్ పై ఉన్న తన అభిమానాన్ని బయటపెట్టుకున్నాడు ఆదనపు కలెక్టర్…ఆ మిల్లర్ కు సహకరించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న అదనపు కలెక్టర్ వేరే దేశం నుంచి తిరిగి రాగానే ఇటీవలే బదిలీ ఐయిన హన్మకొండ జిల్లా కలెక్టర్ కు సదరు మిల్లర్ గూర్చి ఎదో సర్దిచెప్పి న్యూస్10 కథనాలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే కలెక్టర్ నాకు అంత తెలుసు అని విచారణ జరుగుతుంది మీరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది… సివిల్ సప్లయీస్ లో వసూళ్ల వ్యవహారంపై కలెక్టర్ ప్రావీణ్య ఓ నివేదిక సిద్ధం చేయగా ఆ నివేదిక కొత్తగా వచ్చిన కలెక్టర్ దృష్టికి వెళ్లకుండ శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం…ఇలా ఆ మిల్లర్ కు సహకరించడానికి నానా తంటాలు పడుతున్న ఆ ఉన్నతాధికారిని ఆ మిల్లర్ ఆయన ఇంటిలోనే ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తుంది…ప్రసన్నం చేసుకున్న కార్యక్రమం ముగిసాకే సదరు ఉన్నతాధికారి విదేశానికి వెళ్లి తిరిగొచ్చినట్లు సమాచారం…సివిల్ సప్లయీస్ లో కొందరిని అడ్డుగా పెట్టుకొని “అదనపు”దందా నడుపుతున్న ఆ అధికారి అవినీతి భాగోతం పై న్యూస్10 వరుసకథనాలు వెలువరించబోతుంది….పని ఉన్న లేకున్నా నిత్యం కలెక్టరేట్ నే అంటిపెట్టుకుని ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు అదనపు కలెక్టర్ చాంబర్ లోనే ఉంటున్న ఆ మిల్లర్ తో లింక్ ఎంటో…?త్వరలోనే బయట పడనుంది..



