వామ్మో టి ఏ…?

ఆ ఉద్యోగి ఔట్ సోర్సింగ్ ఉద్యోగే కానీ ఆయనంటే మిల్లర్లందరికి హడల్…పౌర సరఫరాల శాఖలో కొందరు అధికారులకు అత్యంత దగ్గర ఉంటాడని పేరున్న ఈ ఉద్యోగి ప్రస్తుతం ఆ శాఖలో ఆడింది అటగా పాడింది పాటగా చెల్లుబాటు అవుతుందట…కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా నిత్యం పిల్డ్ వర్క్ అంటూ బిజీగా ఉండే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందంటే చాలు మిల్లర్లు వినాల్సిందేనని తెలిసింది…అతనే హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి…పేరుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగే ఐయిన ఆ శాఖలో ఉన్న ఉన్నతాధికారికి ఉన్న పరపతి ఈయన గారికి ఉన్నది అనడంలో ఏమాత్రం అతిశేయోక్తి కాదు…అందుకే నేమో టి ఏ సాబ్ వస్తున్నాడు అంటే మిల్లర్లు అలర్ట్ ఐయ్యి సారును ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారని తెలిసింది… ప్రసన్నం అంటే అలా ఇలా కాదు ఏ పని చేస్తే ఎంత…? తనిఖీ చేస్తే ఇంత…పాస్ అంటే కొంత ఇలా పనికో లెక్క ఫిక్స్ చేసిన ఆ టి ఏ సారు బాగానే వెనకేసినట్లు మిల్లర్లలో ప్రచారం జరుగుతోంది…. అంతేకాదు సారును ఎవరు ప్రసన్నం చేసుకోకుంటే ఆ మిల్లర్ కు సరిగ్గా చెప్పాలంటే మూడినట్లే టి ఏ చెప్పినట్లు వింటేనే ధాన్యం పాస్ లేదంటే అంతే సంగతులు… టి ఏ సాబ్ చెప్పినట్లు వినకుంటే హసన్ పర్తి మండలంలో ఓ మిల్లర్ వ్యాపారానికి దూరం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది…ఆర్థికంగా చితికిపోయి ఇప్పటికి కోలుకోవడం లేదని పేరు ప్రస్తావించడానికి ఇష్టపడని ఆ మిల్లర్ న్యూస్10 ప్రతినిధికి ఫోన్ చేసి మరీ తన గోడు వెళ్లబోసుకున్నాడు….

ఉన్నతాధికారికి విశ్వాసపాత్రుడు…

పౌర సరఫరాల శాఖలో టి ఏ ఆ ఉన్నతాధికారికి విశ్వాసపాత్రుడని తెలిసింది…మిల్లర్లు తనను ప్రసన్నం చేసుకోగానే ఆ మరుక్షణమే వెళ్లి ఉన్నతాధికారిని ఈ టి ఏ ప్రసన్నం చేసుకుంటాడని సమాచారం…ధాన్యం ఫిజికల్ వెరిపికేషన్ నుంచి కేటాయింపు,పాస్ చేసే వరకు టి ఏ నే కీలకంగా వ్యవహరిస్తున్నందున ఇతగాడే ఆ ఉన్నతాధికారికి అన్నిరకాల సర్దుబాట్లు చేస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి…అంతే కాదు మిల్లర్స్ అసోసియేషన్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హన్మకొండ జిల్లాలో కొనసాగుతున్న స్టిక్కర్ దందా లో ఈ టి ఏ ,ఆ ఉన్నతాధికారి కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి… ఈ స్టిక్కర్ దందాలో వసూల్ అవుతున్న మొత్తంలో సింహ భాగం వీరికే వెళ్తున్నట్లు తెలియవచ్చింది…టి ఏ గారి ఠీవి లో ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే తనిఖీల పేరుతో మిల్లు మిల్లు తిరిగే టెక్నికల్ అసిస్టెంట్ ఓ మిల్లులో ప్రధాన భాగస్వామిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది….

టి ఏ దందా వినవలె….?

మరో సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here