యూరియా కోసం బారులు

మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు.. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతులకు సకాలంలో యూరియా పంపిణి చేయకపోవడం అన్యాయమని రైతులు వాపోతున్నారు .. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన ప్రభుత్వం యూరియా సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ..గురువారం మొగుళ్లపల్లి సహకార కేంద్రం వద్ద అన్నదాతలు యూరియా కోసం బార్లు తీరిన వైనం చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here