విజిలెన్స్ చెప్పిన చర్యలు లేవు

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ని ఓ మిల్లులో ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు… ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు… ఆ మిల్లు యజమనిపై ఆర్ ఆర్ యాక్టు కింద కేసు నమోదు చేయాలని జిల్లా అధికారులకు చెప్పారు…తనిఖీలకు సంబంధించిన నివేదికను అధికారులకు అందించి తక్షణమే ఆర్ ఆర్ యాక్టు పెట్టమని చెప్పారు…ఇది జరిగి రోజులు గడుస్తున్న హన్మకొండ జిల్లా ఉన్నతాధికారి ఆ మిల్లర్ పై ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి ఆదేశాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది…తనపై కేసు పెట్టకుండా ఉండేందుకు అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఆ మిల్లర్ సైతం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది….ఇదిలావుండగా కమలాపూర్ లో నిర్వహిస్తున్న ఈ మిల్లు కెపాసిటీ కేవలం రెండు టన్నులే ఉండగా ఈ మిల్లు కెపాసిటీ ని మించి ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు కేటాయించినట్లు తెలిసింది… దింతో ఈ మిల్లునుంచి భారీఎత్తున ధాన్యం మాయమయినట్లు తెలిసింది… విజిలెన్స్ తనిఖీలతో ఆ విషయం రూడి ఐయింది…హన్మకొండ జిల్లాలో మిల్లుల కెపాసిటీ తో సంబంధం లేకుండా బకాయి ఉన్న కూడా ఓ ఉన్నతాధికారి జోక్యంతో ఆ నాలుగు మిల్లులకు ఇబ్బడిముబ్బడిగా ధాన్యం కేటాయిస్తున్నారని ,దీనివల్ల ధాన్యం పక్కదారి పడుతుందని ,సర్కార్ ఖజానాకు గండి పడుతుందని న్యూస్10 కథనాల ద్వారా గతంలోనే చెప్పింది…. న్యూస్10 కథనం వల్ల అప్పటి కలెక్టర్ ప్రావీణ్య ఓ మిల్లు నుంచి ధాన్యాన్ని వెనక్కి రప్పించి వేరే మిల్లులకు కేటాయించారు…పలు మిల్లుల్లో ఫిజికల్ వెరిపీకేషన్ సైతం చేయించారు…ఇప్పుడు విజిలెన్స్ తనిఖీలతో ఆ విషయం అక్షర సత్యమని తేలిపోయింది…కమలాపూర్ లోని మిల్లులో విజిలెన్స్ తనిఖీల విషయంలో సివిల్ సప్లయీస్ లో వివరణ కోసం న్యూస్10 ప్రయత్నించగా డి ఎం తో సహా అధికారులెవరు అందుబాటులో లేరు…డి ఎం ను ఫోన్ లో సంప్రదించడానికి న్యూస్10 ప్రతినిధి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు…ఐయితే సివిల్ సప్లయీస్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రోజా రాణి ని విజిలెన్స్ తనిఖీల విషయంలో వివరణ కోరగా తన పై అధికారులు చెప్పనిది తాను ఏ సమాచారం ఇవ్వనని అన్నారు…పనిలోపనిగా ఇతర అధికారులకు ఫోన్ చేసి న్యూస్10 ప్రతినిధి ఏ సమాచారం అడిగిన ఇవ్వకూడదని మిగతా ఉద్యోగులకు ఉచిత సలహా ఇచ్చారు…విజిలెన్స్ తనిఖీలు,ఆ మిల్లు విషయంలో ఉన్నతాధికారి తో సహా సివిల్ సప్లైఈస్ అధికారులంతా ఇంతటి గోప్యతను ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావడం లేదు…ఇంతటి గోప్యతను పాటిస్తున్నారు అంటే ఇందులో ఎదో మతలబు ఉందని అనుమానాలు కలుగుతున్నాయి….

ఏడు కోట్లకు పైగా హాంఫట్…?

సూత్ర దారులు ఎవరు…?

న్యూస్10 ఈరోజు సాయంత్రం సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here