లేబర్ కార్యాలయంలో ఘరానా మోసం

హన్మకొండ జిల్లా లేబర్ కార్యాలయంలో బ్రోకర్ల రూపంలో ఘరాన మోసగాళ్ళు తయారయ్యారు..లబ్దిదారులను టార్గెట్ చేసి కమిషన్లు దండుకొని పనులు చేసి పెడుతామని మాయమాటలు చెప్పి వచ్చిన డబ్బుల్లో సగం తమ ఖాతాలోకి మళ్ళించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…హాన్మకొండ కలెక్టరేట్ లో ఉన్న జిల్లా కార్మిక శాఖ (లేబర్ ) కార్యాలయంలో ఆ కార్యాలయాన్ని అంటిపెట్టుకొని పదుల సంఖ్యలో బ్రోకర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు… కార్మిక శాఖ లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తీసుకొని వారికి మరీ ఫోన్ చేసి పనిచేసిపెడతామని కమిషన్లు ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది…కార్మిక శాఖ డబ్బులు మంజూరి చేయగానే వారి కమిషన్ తీసుకొని లబ్దిదారులకు మిగిలింది ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…హన్మకొండ జిల్లా తో పాటు వరంగల్ జిల్లాలో సైతం మండలానికో బ్రోకర్ కమిషన్ల పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి…సహజ మరణం,ప్రమాదం,ప్రసూతి ఇలా వివిధ సందర్భాల్లో కార్మిక శాఖ నుంచి అర్హులైన లబ్ధిదారులకు వచ్చే మొత్తం లో యాభై శాతం వరకు డబ్బులు బ్రోకర్లకే వెళ్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…కార్మిక శాఖ కార్యాలయం లోనే నిత్యం తిష్ట వేసి ఉండే ఈ బ్రోకర్లు కార్మిక శాఖ కు చెందిన యాప్ లోకి ఎంటరై వివరాలు ఓ నోట్ బుక్ లో రాసుకొని ధరఖాస్తు దారులకు ఫోన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది…వీరికి కార్మిక శాఖ జిల్లా అధికారులు సైతం తమ శాయశక్తులా సహకరిస్తూ కమీషన్ల లో వాటా పంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం…

కమీషన్ల దందా…బ్రోకర్ల హవా…

లేబర్ కార్యాలయంలో మోసం…?

న్యూస్10విశ్వసనీయ కథనం

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here