ధాన్యం కేటాయింపు విషయంలో ఆ ఉన్నతాధికారి చేతివాటం ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా హాండ్ రేసింగ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది…హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణం జరిగి ఓ ముగ్గురు అధికారులు సస్పెన్షన్ కు గురికాగా మిగతా వారు జైలు కు వెళ్లిన ఆ ఉన్నతాధికారి మాత్రం తనకేం పట్టనట్లే వ్యవహరిస్తూ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ చేయడానికి భారీ మొత్తం లో వసూళ్లకు తెర తీసినట్లు తెలుస్తుంది….ధాన్యం కేటాయించుకునేందుకు ట్యాగింగ్ కోసం కొందరు మిల్లర్లు సైతం రాత్రి పూట ఆ ఉన్నతాధికారి నివాసానికి క్యూ కట్టారు…ఒక్కొకరితో ఆ ఉన్నతాధికారి మాట్లాడి కావాల్సింది అందుకొని ధాన్యం కేటాయించి ట్యాగింగ్ చేస్తానని మాట ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది…శుక్రవారం రాత్రి కొందరు మిల్లర్లు ఉనతాధికారి ఇంటికి కార్లల్లో వచ్చినట్లు ఆలస్యంగా తెలిసింది…కాగా పరిస్థితి ఏటో దారి తీస్తుందని తెలుసుకున్న ఆ మిల్లర్లు ఒకొక్కరుగా అక్కడనుంచి మెల్లగా జారుకున్నారు…హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో యథేచ్ఛగా వసూళ్లు, భారీ కుంభకోణం జరిగిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఎందుకు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు…కాగా ధాన్యం భారీ కుంభకోణం లో విచారణ ఎదుర్కొంటున్న ఈ ఉన్నతాధికారి ఎవరి అండతో మిల్లర్ల వద్ద నుంచి ధాన్యం కేటాయించడం మొదలుకొని ట్యాగింగ్ వరకు అన్ని పనులకో రేటు కట్టి ఎందుకు వసూళ్లు చేస్తున్నాడో వారికే తెలియాలి….దీనికి తోడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పేరుతో అసోసియేషన్ నాయకుడు సైతం భారీగానే వసూళ్లకు తెరతీసినట్లు తెలిసింది.. ఉన్నతాధికారి ఓ వైపు మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు మరోవైపు వసూళ్లకు తెరతీసి మిల్లర్స్ ను పీల్చిపిప్పి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి….కాగా మిల్లర్స్ అసోసియేషన్ లో లుకలుకలు మొదలుకాగా కార్యదర్శిని పక్కనపెట్టి అధ్యక్షుడు అడ్డగోలు వసూళ్లు చేస్తున్నట్లు తెలియవచ్చింది….అంతేకాదు ధాన్యం ట్యాగింగ్ కోసం మంత్రి బంధువు,రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు దగ్గరుండి వసూళ్ల కథ నడిపిస్తున్నట్లు తెలుస్తుంది…నిన్నటికి నిన్న ఉన్నతాధికారిని హన్మకొండ లోని ఆయన నివాసంలో కొంతమంది మిల్లర్స్ తో కలిసి ట్యాగింగ్ కోసం ఒక్కో మిల్లర్ రెండు లక్షలు సమర్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం…మిల్లర్ల వద్దనుంచి ఈ రెండు లక్షలు వసూలు చేసే బాద్యత మంత్రి బంధువు ఐయిన మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు తీసుకున్నట్లు తెలిసింది…కాగా ఇప్పటికే ఓ ఎనిమిది మంది మిల్లర్లు ఒప్పుకున్న మొత్తం అసోసియేషన్ నాయకుడి సమక్షంలో చెల్లించినట్లు తెలియవచ్చింది…చెల్లింపుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ…తాను తీసుకున్నది ఎవరి కంట పడకుండా,ఇల్లు,కార్యాలయం కాకుండా కారు లోనే ఉన్నతాధికారి చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది…తన వాహనం లో మిల్లర్ ను ఎక్కించుకొని ఇవ్వాల్సింది సమర్పించగానే దించేసి పని పక్కా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం…శుక్రవారం రాత్రి సరిగ్గా ఇదే సీన్ జరిగినట్లు తెలిసింది…


ధాన్యం కేటాయింపు పేరుతో అడ్డగోలు వసూళ్లు…?
ట్యాగింగ్ కావాలంటే అక్షరాల రెండు లక్షలు…?
బ్యాంక్ గ్యారెంటీ లేకున్నా ధాన్యం కేటాయించాలంటే మరో రేటు..?
మంత్రి బంధువా మజాకా…?
మిల్లర్ల వద్ద నుంచి అసోసియేషన్ పేరుతో పె(ద్ధి)ద్దగా వసూళ్లు…?
న్యూస్10 విశ్వసనీయ కథనం రేపటి సాయంకాల సంచికలో….




