దందాను అడ్డుకునే దమ్ముందా…?

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీన్ పేట లో లేబర్ కార్డుల పేరుతో లబ్దిదారుల నుంచి అడ్డగోలుగా దండుకుంటున్న అయ్యా కొడుకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది… లేబర్ కార్డుల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తూ లబ్ధిదారులకు కార్మిక శాఖ నుంచి మంజూరి ఐయిన మొత్తం నుంచి లక్షల్లో దండుకుంటున్న ఈ బ్రోకర్ అయ్యా, కొడుకులు చేసేది ఎదో పుణ్యకార్యం ఐయినట్లు వార్తలు రాస్తే అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది… ఈ అయ్యా ,కొడుకుల చేతిలో మోసపోయి లక్షల రూపాయలు కోల్పోయిన భాదితులు ఉన్న విషయం చెపితే మీడియాకు ఎందుకు చెపుతున్నారు, తమని ఎవరు ఎం చేయలేరు అంటూ బండ బూతులు తిడుతూ, బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం….

ఇదీ వసూళ్ల వరుస…?

నెక్కొండ మండలం అమీన్ పేట గ్రామంలో అయ్యా, కొడుకుల అక్రమాలకు అంతు లేకుండా పోతోంది… లేబర్ కార్డుల పేరుతో లక్షల్లో దండుకుంటు మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి… అమీన్ పెట్ గ్రామానికి చెందిన పోలినేని వెంకట్రావుకూతురు పద్మ చనిపోతే లేబర్ కార్డు పేరుతో తండ్రి, కొడుకులు గరికపాటి రాంగోపాల్, తనయుడు గరికపాటి ప్రకాష్ లు లబ్దిదారుడికి మంజూరైన ఆరు లక్షల ముప్పే వేలల్లో లక్ష 80 వేలు అక్రమంగా తీసుకున్నట్లు తెలిసింది… అలాగే లింగగిరి గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు కూతురు గర్భిణీ స్త్రీ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోగా 30 వేల రూపాయలు మంజూరు అయితే 15 వేల రూపాయలు కమిషన్ తీసుకున్నట్లు సమాచారం… ఈ గ్రామంలో అయ్యా,కొడుకులకు లేబర్ కార్డు పేరుతో, గర్భిణీ స్త్రీలు మరియు అకాల మరణాలు వీళ్ళకి టార్గెట్గా మారి వారి వద్దనుంచి అడ్డగోలుగా కమిషన్లు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది… పరికిరాల గ్రామానికి చెందిన మూల సంజీవ్ అకాల మరణం చెందితే లేబర్ కార్డు పేరుతో లక్ష ఇరవై వేల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు తెలిసింది…

చలనం లేని లేబర్ అధికారులు..

నెక్కొండ మండలం అమిన్ పేట గ్రామంలో అయ్యా,కొడుకులు అడ్డగోలుగా పైరవీల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్న లేబర్ అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది… పైరవీల పేరుతో లేబర్ కార్డుల ఇప్పిస్తాం అంటూ వసూళ్లు చేస్తూ, కార్మిక శాఖ నుంచి డబ్బులు ఇప్పిస్తాం అంటూ చెపుతున్న వీరికి అసలు లేబర్ కార్యాలయం నుంచి సహకరిస్తున్న అధికారులు ఎవరు…?అని కొందరు ప్రశ్నిస్తున్నారు… జిల్లా లేబర్ కార్యాలయం లోని కొందరు అధికారుల సహకారం తోనే ఈ అయ్యా,కొడుకులు అక్రమ వసూళ్ల తో రెచ్చి పోతున్నట్లు తెలుస్తుంది…. అలాగే వసూళ్లు చేస్తాం తమను ఎవరు ఏం చేయలేరు అని వీరిద్దరూ ధీమా వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది….మరి ఇకనైనా ఈ అయ్యా, కొడుకులపై లేబర్ అధికారులు చర్యలు తీసుకుంటారా…? లేక మాకెందుకని వదిలేస్తారా…? చూడాలి…

ప్రశ్నిస్తే బెదిరింపు లే…!

డబ్బులు వసూలు చేశారని చెప్పిన వారిని బెదిరిస్తున్న అయ్యా, కొడుకులు. 

పనిచేసి పెట్టలేదా…? అంటూ బ్లాక్ మెయిలింగ్

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here