ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు
పోలీసులకు అనేక సరెండర్ లీవులు, డీఏలు, టీఏలు పెండింగ్ ఉన్నాయి, వారికి రావాల్సిన ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది
రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారు
ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీని తక్షణమే అమలు చేయాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు



