వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డు కాకతీయ జూలాజికల్ పార్క్ లో వైట్ టైగర్ శరణ్ మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్ లో చనిపోయింది. కాగా, వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ తో చనిపోయిందని జూ అధికారులు అంటున్నారు. మంగళవారం పులి అంత్యక్రియలు చేసినట్లు జూపార్క్ పర్యవేక్షణ అధికారి మయూరి తెలిపారు. అయితే అధికారుల మెంటనెన్స్ సరిగా లేకనే రెండు రోజులుగా అనారోగ్యానికి గురై చనిపోయినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ జూ పార్క్ నుంచి తెల్ల పులిని జూలై మాసంలో వరంగల్ తీసుకొచ్చారు. పులి సంరక్షణ సరిగా లేకనే అనారోగ్యానికి గురై మృత్యు వాత పడినట్లు సమాచారం. అధికారులు మాత్రం పులి అనారోగ్యం, గుండె పోటుతో చనిపోయిందని చెబుతున్నారు. జిల్లా అధికారులు పులి మృతి విషయం గొప్యంగా ఉంచి, అంత్యక్రియల తరువాతనే అనారోగ్యంతో మృతి చెందినదని జూ అధికారి చెప్పారు…కాకతీయ జూలోని సుమారు 15 సంవత్సరాల వయస్సు గల వైట్ టైగర్ వృద్ధాప్యం మరియు గుండెపోటు కారణంగా మృతి చెందిందని…
సాధారణంగా తెల్ల పులి సగటు ఆయుష్షు సుమారు 14 సంవత్సరాలు కాగా, కాకతీయ జూ వెటర్నరీ అధికారులు, సిబ్బంది ఇచ్చిన మెరుగైన వైద్య సేవలు మరియు సంరక్షణ విధానాల వలన 15 సంవత్సరాల వరకు జీవించిందని జూ సంరక్షణ అధికారి మయూరి అంటున్నారు…
వృద్దాప్యం వలన వచ్చిన బి.పి, గుండె సంబంధిత మరియు మూత్రపిండ సమస్యలతో గత రెండు నెలలుగా బాధపడుతున్న పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికీ, మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందిందని మయూరి తెలిపారు…
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింస్థామన్నారు….
https://youtu.be/bC8TxymVBkU?si=ya6eXnMR7nn2HvRP





