పౌల్ట్రీ ఫాం లో బాల కార్మికుల వ్యవహారం కొత్తగట్టు నుంచి ఒగ్లా పూర్ కు మారింది… హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తగట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి ని ఆనుకుని ఉన్న పౌల్ట్రీ లో బాలకార్మికులు ఉండగా న్యూస్10 లో కథనాలు వెలువడిన నేపథ్యంలో బాలకార్మికులను ఇప్పుడు వేరే చోటుకు మార్చినట్లు తెలుస్తుంది.. కొత్తగట్టు పౌల్ట్రీ యజమానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బీహార్ రాష్ట్రనికి చెందిన టేకేదార్ రంగీల తాను తీసుకువచ్చిన బాల కార్మికులను తీసుకొని పలాయానం చిత్తగించినట్లు తెలిసింది… సిద్దిపేట జిల్లా కేంద్రం గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పౌల్ట్రీ పామ్స్ కు బీహార్ రంగేలా బాలకార్మికులను తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం…
బీహార్ రంగేలా నయా ప్లాన్..?
రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్ లకు బాల కార్మికులను తీసుకువచ్చే బీహార్ కు చెందిన రంగీలా తన రూటు మార్చి నయా ప్లాన్ కు తెరతీశాడు.. కొత్తగట్టులోని పౌల్ట్రీ ఫార్మ్ కు బాల కార్మికులను తీసుకువచ్చిన రంగీలా ఆ విషయం బయటకు పోక్కడంతో అక్కడ యజమానితో ఓ ఒప్పందం కుదుర్చుకొని అక్కడి బాల కార్మికులను ఒగ్లాపూర్ లోని ఓ పౌల్ట్రీ ఫామ్ కు బాల కార్మికులను తరలించినట్లు తెలిసింది.. కొత్తగట్టులో మొన్నటి వరకు పని చేసిన బాల కార్మికులందరూ ప్రస్తుతం ఓగ్లా పూర్ లోని పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్నారు . ఈ ఫామ్ లో పదుల సంఖ్యలో బాల కార్మికులు పౌల్ట్రీ పనులు చేస్తూ కనిపించారు.. ఒగ్లాపూర్ దర్గా వెనకాల ఉండే ఈ పౌల్ట్రీ ఫామ్ లో కార్మిక శాఖ అధికారుల తనిఖీలు నామవాత్రంగా ఉండడంతో ఈ పౌల్ట్రీ ఫార్మ్ యజమాని తన ఇష్టారీతిన బాల కార్మికులను నియమించుకొని పనులు చేయిస్తున్నాడు.. బాల కార్మికులతో ఎం పని ? అని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఆ పౌల్ట్రీ యజమాని ఫామ్ లోని అన్ని పనులకు బాల కార్మికులను ఉపయోగిస్తున్నట్లు తెలియ వచ్చింది.. కొత్తగట్టు ఫాం యజమాని ఒగ్లాపూర్ ఫామ్ యజమాని వీరిద్దరూ స్వయాన సోదరులు కాగా వీరు బాల కార్మికులతోనే అన్ని పనులు చేయిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. కార్మిక శాఖ అధికారులకు అత్యంత సన్నిహితంగా వీరు వ్యవహరిస్తూ బాల కార్మికుల వ్యవహారాన్ని వీరిద్దరూ చక్కబెడుతున్నట్లు సమాచారం.. ఒగ్లాపూర్ లోని పౌల్ట్రీ ఫామ్ లో ప్రస్తుతం బాల కార్మికులతో పనులు చేయిస్తుండగా, కొత్తగట్టు లోని పౌల్ట్రీ ఫామ్ లో తిరిగి బాల కార్మికులను బీహార్ నుంచి రప్పించేందుకు ఆ పౌల్ట్రీ యజమాని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియ వచ్చింది.. ఇది ఇలా ఉంటే ఒగ్లాపూర్ లోని పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్న చైల్డ్ లేబర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.. కోడిపెంట, ఈగలు, దోమలు మధ్య బాల కార్మికులు అతికష్టం మీద పనులు చేస్తున్నట్లు తెలిసింది.. ఈగలు దోమలు రాకుండా వాటి బారిన బాల కార్మికులు పడకుండా పౌల్ట్రీ యజమానులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వారి చేత పనులు చేయిస్తుండడంతో బాల కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిసింది.. ఇంత జరుగుతున్న జిల్లా కార్మిక శాఖ అధికారులు తమకేం తెలియనట్లు నటిస్తున్నారు.. బాల కార్మికుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిన కొందరు కార్మిక శాఖ అధికారులు పౌల్ట్రీ యజమానులతో కుమ్మక్కై విషయాలన్నీ తెలిసిన చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పౌల్ట్రీ ఫామ్ ల విషయంలో ఎన్ని ఫిర్యాదులు అందిన, ఎంతమంది స్వయంగా ఫిర్యాదులు చేసిన, పత్రికల్లో వరుస కథనాలు వచ్చిన తమకే సంబంధం లేనట్లు కార్మిక శాఖ అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఇకనైనా కార్మిక శాఖ అధికారులు ఈ రెండు పౌల్ట్రీ ఫార్మ్స్ ల పై చర్యలు తీసుకుంటారా..? లేదా మాకేం సంబంధం అంటూ చేతులు దులుపుకుంటారా..? వేచి చూడాలి…




