మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను కొల్లగొడుతు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. వేసవికాలం కావడంతో చెరువుల్లోని రేగడి మట్టిపై కన్నేసిన కొందరు కేటుగాళ్ళు వ్యవసాయ అవసరాల నిమిత్తం అంటూ అరకొరగా ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు పొంది కమర్షియల్ గా ఇటుక బట్టీల వ్యాపారానికి తరలిస్తు రాత్రికి రాత్రే లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అసలు ఇటుక బట్టీలకు రెవెన్యూ శాఖ నుండి కానీ ఇతర శాఖల నుండి గాని ఎలాంటి అనుమతి లేనప్పటికీ వారు యదేచ్చగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి రెండు వైపులా గండి పడతుంది. అసలు అనుమతులే లేని ఇటుక బట్టీలకు చెరువులోని స్వచ్ఛమైన రేగడి మట్టిని తరలించడానికి ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
దందా అంతా ఇరిగేషన్ శాఖ కనుసన్నల్లోనే…
ఇటుక బట్టీలకు మట్టి రవాణాకు అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులకు పెద్ద మొత్తంలో కాసులు ముట్టజెప్పి అడ్డగోలుగా అనుమతులు పొందినట్లు తెలుస్తోంది.పది రోజులకు గాను తీసుకున్న అనుమతులకు మించి తవ్వుతున్న మట్టి పై ఎలాంటి చర్యలకు సిద్ధపడకపోవడం ఒకింత అనుమానాన్ని రేకెత్తిస్తోంది. రాత్రి,పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో సహాయంతో తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి వారు ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.నెక్కొండ డివిజన్ పరిధి కలిగిన నెల్లికుదుర్ లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో డీఈఈ రామ్ దాస్ ఉన్నారన్న ఆరోపనలు ఉన్నాయి.కేవలం 1500 క్యూబిక్ మీటర్లకు మాత్రమే ప్రభుత్వ ఫీజు చెల్లించిన సదరు మట్టి వ్యాపారులు అనుమతికి మించి తరలిస్తుంటే వారిపై చర్యలకు ఎప్పుడు సిద్ధపడుతారో మరి..సహజ వనరులను కాపాడేందుకు ప్రభుత్వ కఠిన చట్టమైన
వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి సహజ వనరులను కొల్లగొడుతున్న అక్రమార్కులపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలి…







