హన్మకొండ జిల్లా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో భారీ అక్రమాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక లెక్కల్లో లేని దాదాపు 30 వేల ధాన్యం బస్తాలు ఒక్కసారిగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ బస్తాలు ఆర్ఆర్ యాక్ట్ కింద సీజ్ చేసిన రైస్ మిల్లులో ఉండటం. అసలు ఆ ధాన్యం ఎవరిది..? సీజ్ చేసిన మిల్లులోకి ఎలా చేరింది..? ఆ బస్తాలను నిల్వ చేయడానికి అనుమతిచ్చింది ఎవరు..? అనంతరం వాటిని విడుదల చేసింది ఎవరు..? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేలాది బస్తాల ధాన్యం వ్యవహారంలో కోట్ల రూపాయల లావాదేవీలు, అధికారుల అండదండలు, మిల్లర్ల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఈ గూడుపుఠాణి వెనుక ఉన్న అసలు కథ ఏమిటన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదీ సంగతి…!!
ఎన్ని అక్రమాలు బయటపడ్డ, ఏసీబి, విజిలెన్స్ దాడులు జరిగిన ఉన్నతాధికారులు అడప దడప చర్యలు తీసుకున్న హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ ఏమాత్రం గాడిలో పడేట్లు లేదు… ధాన్యం అక్రమాల్లో అందవేసిన చెయ్యి గా ఈ జిల్లా శాఖ ఉందని విమర్శలు వస్తున్నా ఇక్కడి అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు…ప్రశ్నిస్తే మాత్రం ఎదురుదాడి చేయడం తామాంతటి సుద్ద పూసలు ఎవరు లేరని ఎదుటివారిపై ఆరోపణలు చేయడం లో ఈ శాఖ అధికారులు ముందుంటున్నారు…. అవినీతి జరిగిన దానిని కప్పిపుచ్చడం లో ఈ జిల్లా సివిల్ సప్లై అధికారులు సిద్దహాస్తులు గా మారారు…తాజాగా హన్మకొండ జిల్లా లోని ఓ మిల్లులో అది బకాయి ఉన్న మిల్లులో దాదాపు ముప్పైవేల బస్తాలు అంటే మూడు కోట్ల విలువ చేసే దాన్యం బయటపడిన వాటిని ఎలా రక్షించాలి అందులో ఇరుక్కుపోయిన మిల్లర్ ను ఎలా రక్షించాలని రక్షణ కవచం పట్టుకొని అధికారులు కదులుతున్నారు తప్ప 2004 సంవత్సరం లో తొమ్మిది కోట్ల 40లక్షలకు పైగా సర్కార్ కు సి ఎం ఆర్ పెట్టకుండా బకాయి పడి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద సీజ్ చేయబడ్డ మిల్లు గోదాం లోకి ముప్పై వేల దాన్యం బస్తాలు రావడం నిజంగానే మ్యాజిక్… ఎలాగూ ఆర్ ఆర్ యాక్ట్ కింద సీజ్ ఐయిన మిల్లే కదా అందులో దాన్యం నిల్వ చేద్దామని అధికారులు వెళ్లి సీజ్ చేసిన మిల్లు గోదాం తెరిస్తే దాన్యం ప్రత్యక్షం కావడం ఆ దాన్యాన్ని రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు ఏప్రిల్ 9న సీజ్ చేయడం సీజ్ చేసిన మూడు రోజుల్లో ఆ దాన్యం మాయం కావడం ఇదో మహా వింత ఇంతకీ ఆ దాన్యం ఎవరు తీసుకువెళ్లారు…? ఎక్కడికి తీసుకువెళ్లారు..,? అసలు ఆ దాన్యం సీజ్ చేయబడ్డ మిల్లు గోదాం లోకి ఎలా వచ్చాయి…? గోదాం తాళం చెవి ఎవరికీ ఎవరు ఇచ్చారు…? గోదాం లో దాన్యం మూడు రోజుల్లోనే మాయం ఐయితే ఏప్రిల్ 13న ఆ ధాన్యం మాదే తీసుకుపోతాం అనుమతి ఇవ్వండి అని ధరకాస్తూ చేసుకున్న సత్య హరిచంద్రులు ఎవరు…? ఇదంతా సక్రమమే అని సర్టిపికెట్ ఆ అధికారి ఎందుకు ఇవ్వాల్సి వ స్తుంది…? బంధు ప్రీతి కోణం ఏమైనా ఉందా…? ఇవన్నీ సమాధానం లేని భేతాల ప్రశ్నలు అని అనుకున్న చాలా చాకచక్యంగా అవినీతి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు ఎందుకు వస్తున్నాయి…? రుద్రమాంబ ఆగ్రో ఇండస్ట్రీస్ దాన్యం గూడుపుఠాణి ఏంటి…? పూర్తి సమగ్ర వివరాలు, ఆధారాలతో న్యూస్10 బ్లాస్టింగ్ విశ్వసనీయ కథనం మరో సంచికలో….



