కదిపితేనే కంగారు..!!

డి టి మేడం మహా వసూళ్ళు అనే కథనం న్యూస్ 10పత్రికలో ఇంకా వెలువరించక ముందే ఆ మహిళా డి టి లో కంగారు మొదలైంది… తన సొంత శాఖ ఉద్యోగుల నుంచే ఎస్ ఆర్ రాయడానికి వేలల్లో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుందని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆ మహిళా అధికారి న్యూస్10ఇంట్రో కథనం తోనే కంగారు పడిపోయి న్యూస్10 ప్రతినిధుల పై కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలిసింది.. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి న్యూస్10గూర్చి ఆరా తీసినట్లు సమాచారం… అంతేకాదు కథనం వస్తుంది అని ఇంట్రో రాగానే ఆ మండల తహశిల్దార్ న్యూస్10 స్థానిక విలేకరిని పిలిచి ఆరా తీసి ఫలానా అధికారి మీకు వివరాలు చెప్పాడు కదా అంటూ ఆరా తీసి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేసాడు… తన కార్యాలయంలో ఎన్ని ఆర్ టి ఐ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి..? ధరకాస్తూ దారులు అప్పీల్ కు పొతే ఏమవుతుంది…? మండల వ్యాప్తంగా ఎంతమంది రైతులు తమ భూముల సర్వే కోసం ధరఖాస్తు చేసుకున్నారు…? వందల సంఖ్యలో ధరకాస్తులు ఉంటే పరపతి ఉన్న వారి భూములే ఎందుకు ముందుకు సర్వే చేస్తున్నారు…? సర్వేయర్ వేలల్లో డబ్బులు తీసుకుంటున్నట్లుఎందుకు ఆరోపణలు వస్తున్నాయి…? ఈ విషయాలపై ఎలాంటి అవగాహన లేకుండా ఉన్న ఆ తాశిల్దార్ డి టి మేడం వార్త పై మాత్రం విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు..ఇదిలావుంటే తనపై న్యూస్10 లో కథనం వస్తే ఎలా బెదిరించాలి…? ఏ కారణం చూపి వార్త రాకుండా అడ్డుకోవాలి…? ఏ విషయం చెబితే న్యూస్ 10బయపడిపోతుంది…? తాటాకుల చప్పుడు ఏ మేరకు చేయాలి…? అని డి టి మేడం అప్పుడే ప్రయత్నాలు చేస్తూ తలమూనకలై ఉన్నట్లు తెలిసింది… తనకు తెలిసినవారికి చెప్పి అడ్డుకోవాలి…? అంటూ ఊరు,పేరు చెప్పకముందే గుమ్మడికాయ దొంగలు అది మేమే అంటూ బయటపడి పోతున్నారు… నేను ఫలాన సంఘం లీడర్ ను మాట్లాడుతున్న అంటూ బిల్డప్ ఇస్తున్నారు… ఎవరు ఎన్ని బిల్డప్ లు ఇచ్చిన తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు అన్ని ఆధారాలతో న్యూస్ 10సిద్ధంగా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here