భవన యజమాని ఇష్టం…

గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ నగరంలో సుబేదారి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు… నిబంధనలతో తనకెం పని అనుకున్నాడేమో ఆ యజమాని అనుమతులు తీసుకున్న ప్రకారం కాకుండా తన ఇష్ట ప్రకారం ఓ పెద్ద భవంతిని నిర్మిస్తున్నాడు… నిర్మాణం పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు ఏ అధికారి కానీ ఇదేంటి..? అని ప్రశ్నించిన దాఖలాలు లేకపోవడంతో భవన యజమాని ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

భవన యజమాని ఇష్టం...- news10.app

సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణం

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 50 వ డివిజన్ పరిధిలో సుబేదారి శాంతినగర్ వద్ద వీధి నెం1 లో ఓ బిల్డర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణం చేపట్టాడు.. హైదరాబాద్ ప్రధాన రహదారి ని ఆనుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణం చేస్తున్నారు అంతేగాక అంతర్గత రోడ్డునుండి నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ అయి నిర్మాణం చేపట్టాలి కానీ ఇవేవీ పట్టించుకోకుండా తన ఇష్టారీతిన నిర్మాణం చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు.

టౌన్ ప్లానింగ్ అధికారులెక్కడా?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి ఈ కార్పొరేషన్ పరిధిలో ఎవరు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా చర్యలు తీసుకునే అధికారులు మరీ ఇంత బహిరంగంగా సుబేదారి శాంతినగర్ వీధి నెం 1 లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు కనబడడం లేదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here