మా బిల్డింగ్ మా ఇష్టం

వరంగల్ త్రి నగరిలో గ్రేటర్ వరంగల్ పరిధిలో అక్రమ నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది… కనీస అనుమతులు లేకుండా కొంతమంది భవనాలను నిర్మిస్తూ మా బిల్డింగ్ మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దింతో త్రినగరి పరిధిలో అక్రమ నిర్మాణాల సంఖ్య బాగానే పెరిగి పోతుంది. రాజకీయ నాయకుల అండ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది ఈ నిర్మాణాలను చేస్తూ ఎం చేస్తారో… చేసుకోండి అన్నట్లు మున్సిపల్ అధికారులకే సవాల్ విసిరినట్లు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది గ్రేటర్ అధికారుల అండతో అంతా ఆ అధికారి చూసుకుంటాడనే ధీమాతో నిర్మాణాలు పూర్తి కానిస్తున్నట్లు తెలియ వచ్చింది.

మా బిల్డింగ్ మా ఇష్టం- news10.app

చూసి చూడనట్లు….

గ్రేటర్ వరంగల్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు పెరిగిపోతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగరం అంతట ఇలాంటి నిర్మాణాలు ఉండగా గ్రేటర్ పరిధిలో .మున్సిపల్ అధికారుల కు సమాచారం ఇచ్చేందుకు సిబ్బంది ఉన్నా… వారినుంచి వీరికి సమాచారం అందిన టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.కొంతమంది భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్న కొంతమంది అనుమతుల ముసుగులో కనీసం సెట్ బ్యాక్ కూడా లేకుండా నిర్మాణాలు చేస్తూ తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… దీనికంతటికీ కారణం బిల్డింగ్ యజమానులతో అధికారులు మిలాఖత్ కావడమేననే ఆరోపణలు లేకపోలేదు… ఓ వైపు రాజకీయ పైరవీల ఒత్తిళ్లు మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వెరసి గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది.

నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై న్యూస్10 వరుస కథనాలు బుధవారం నుంచి మొదలు…….. ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here