కదిలిన టౌన్ ప్లానింగ్… కదలని అగ్నిమాపక శాఖ

నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించి,కనీస ఫైర్ సేఫ్టీ ని పాటించకుండా ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న సృష్టి ఆసుపత్రి యాజమాన్యం పై గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీరియస్ ఐయినట్లు తెలిసింది. న్యూస్10 వరుస కథనాలపై స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ముందుకు కదిలారు.. నేడో రేపో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది… మరోవైపు ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ లేకపోవడంపై ఇప్పటికి అగ్నిమాపకశాఖ అధికారులు స్పందించలేదు…

కదిలిన టౌన్ ప్లానింగ్... కదలని అగ్నిమాపక శాఖ- news10.app

రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన సిటీ ప్లానర్

వరంగల్ నగరంలోని పోచంమైదాన్ జంక్షన్ పక్కనే ఉన్న సృష్టి హాస్పిటల్ బిల్డింగ్ ను తనిఖీ చేసి రిపోర్ట్ సమర్పించాలని సంబంధిత అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించినట్లు సిటీ ప్లానర్ వెంకన్న న్యూస్-10 కు తెలిపారు గత మూడు రోజులుగా న్యూస్-10 లో సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ పై వస్తున్న కథనాల నేపథ్యంలో విచారణ కు ఆదేశించినట్లు తెలుస్తోంది

సృష్టిలో మొదలైన టెన్షన్…

మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి బిల్డింగ్ ను నిర్మించుకున్న ” సృష్టి “యాజమాన్యం లో టెన్షన్ మొదలైనట్లుగా తెలుస్తోంది గత మూడురోజులుగా న్యూస్-10 లో వస్తున్న కథనాల పై టౌన్ ప్లానింగ్ అధికారులు విచారణకు సిద్ధమైనట్లు తెలుసుకున్న యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం

కదిలిన టౌన్ ప్లానింగ్ కదలని అగ్నిమాపక శాఖ

వరంగల్ లోని సృష్టి హాస్పిటల్ బిల్డింగ్ పై న్యూస్-10వరుస కథనాలను ప్రచురించిన విషయం విదితమే .ఈ కథనాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి విచారణ చేయనున్నట్లు సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు .ఆసుపత్రి బిల్డింగ్ అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం లేకున్నా అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం ఆ బిల్డింగ్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని తెలుస్తోంది. న్యూస్-10 లో గత మూడు రోజులుగా కథనాలు వస్తున్నా కూడా అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here