సృష్టి లో ఫైర్ సేఫ్టీ ఎక్కడ…?

సృష్టి ఆసుపత్రి యాజమాన్యం బిల్డింగ్ నిర్మాణం తమ ఇష్టారాజ్యాంగ చేసుకుంది… నిబంధనలతో తమకేం పని అన్నట్లు కనీస నిబంధనలు కూడా పాటించకుండా భవన నిర్మాణం చేసుకొని ఆసుపత్రి కొనసాగిస్తున్నారు… ఆసుపత్రికి వచ్చే పేషంట్ల భద్రతను గాలికొదిలి ఫైర్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా నిర్మాణం చేశారు… ఏదైనా ప్రమాద సమయంలో ఫైర్ ఇంజన్ వస్తే కనీసం భవనం చుట్టూ తిరిగే స్థలం కూడా లేకుండా నిర్మాణం చేసి బాగానే నిర్మాణం చేసాం అనే భావనలో ఆసుపత్రి యాజమాన్యం ఉన్నట్లు కనిపిస్తుంది… యథేచ్ఛగా నిబంధనలు ఆసుపత్రి యాజమాన్యం ఉల్లంఘించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకేం పట్టనట్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు… దింతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి….

సృష్టి లో ఫైర్ సేఫ్టీ ఎక్కడ...?- news10.app

ఫైర్ నిబంధనలకు తూట్లు

వరంగల్ నగరంలోని పోచంమైదాన్ జంక్షన్ లో ఉన్నటువంటి సృష్టి హాస్పిటల్ ఫైర్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మించినట్లు కనపడుతుంది. ఆ హాస్పిటల్ యాజమాన్యం ఫైర్ నిబంధనలతో మాకేం పని అన్నట్లు బిల్డింగ్ నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది .ఫైర్ నిబంధనల ప్రకారం బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరగడానికి స్థలం వదిలిపెట్టి బిల్డింగ్ నిర్మాణం చేయాలి కానీ ఈ ఆసుపత్రి యాజమాన్యం అవేమి పట్టించుకోకుండా ఆసుపత్రి బిల్డింగ్ ను వారికి నచ్చిన విధంగా కట్టుకున్నారు

టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతిచ్చారు…?

వరంగల్ లోని సృష్టి హాస్పిటల్ కాగితాల మీద ఒకలా అనుమతి పొంది… బిల్డింగ్ ను మాత్రం తమకు నచ్చిన విధంగా నిర్మించుకున్నట్లు సమాచారం .మున్సిపల్ నిబంధనలు తుంగలో తొక్కి పూర్తి సెట్ బ్యాక్ లేకుండానే ఆసుపత్రి నిర్మాణం చేసినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

అగ్నిప్రమాదం జరిగితే బాధ్యులెవరు…..?

సృష్టి ఆసుపత్రిలో అనుకోకుండా ఏదయినా అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ ఆసుపత్రి ఫైర్ నిబంధనల ప్రకారం నిర్మించనట్లు ఆ బిల్డింగ్ ను చూస్తే అర్డంచేసుకోవచ్చు. అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం బిల్డింగ్ చుట్టూ “యూ” ఆకారంలో ఫైర్ ఇంజిన్ తిరిగే విధంగా బిల్డింగ్ నిర్మాణం ఉండాలి కానీ ఈ బిల్డింగ్ చుట్టూ కనీసం సైకిల్ కూడా తిరగదని సమాచారం.. మరి అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరువహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు..నిర్మాణ నిబంధనలు ఈ స్థాయిలో ఉల్లంఘించి ఆసుపత్రి భవన నిర్మాణం చేసిన యాజమాన్యం పై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారా….లేక తమకేం పని అన్నట్లు చూసి చూడనట్లు వదిలేస్తారా …? చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here