లిక్కర్ డాన్ తనయుని కేసులో కీలక మలుపు…

గత కొద్ది నెలలక్రితం సంచలనం కలిగించిన లిక్కర్ డాన్ కేసులో కీలక మలుపు వచ్చినట్లు తెలిసింది. మొదటినుంచి ఊహించిన్తట్లుగానే ఇందులో అనుమానిస్తున్నట్లు కొందరు సీఐ ల పాత్రపై నివేదిక సిద్ధం అయినట్లు తెలిసింది. లిక్కర్ డాన్ తనయుడితో కలిసి భూ దందాలు, సెటిల్మెంట్లు, లిక్కర్ వ్యాపారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన సీఐల పై అధికారులు విచారణను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు సమాచారం.గత కొద్ది రోజుల క్రితం లిక్కర్ డాన్ బర్త్ డే సందర్భంగా 15 మంది సీఐలు లిక్కర్ డాన్ ఇచ్చిన ఓ పార్టీ లో పాల్గొని తాము అన్ని విధాలా సహకరిస్తాం అని అభయం ఇచ్చినట్లు తెలిసింది లిక్కర్ డాన్ తనయునితో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొంతమంది సిఐ లు ఎవరని … ఇంటలిజెన్స్. ఎస్బి అధికారులు ఆరాతీసి ఉన్నతాధికారులు నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.

లిక్కర్ డాన్ తనయుని కేసులో కీలక మలుపు...- news10.app

విదేశీ పర్యటనలకు వెళ్లిన సీఐల ఎవరు? రెగ్యులర్ పార్టీ లకు వెళ్తున్నది ఎవరు అనే విషయం ఇప్పటికే నిఘా వర్గాలు పోలీసు బాస్ కు చేరవేసినట్లు తెలియవచ్చింది. అలాగే బ్యాంకాంగ్, మలేషియా, గోవా తదితర ఇతర ప్రాంతాలకు లిక్కర్ డాన్ తనయుడితో కలిసి విహారానికి వెళ్లిన సీఐల పాస్ పోర్టుల ఎంక్వైరీ పూర్తి చేసి ఆ నివేదికను సైతం పోలీసు బాస్ కు సమర్పించినట్లు తెలిసింది.

సీఐల పై వేటుకు రంగం సిద్ధం…?

లిక్కర్ డాన్ తనయుడితో కలిసి జల్సాలు చేస్తూ అన్ని విషయాల్లో అంటకాగిన సిఐ ల పై వేటు వేసేందుకు రంగం సిద్ధం ఐయినట్లు తెలిసింది. ఇదిలాఉంటే లిక్కర్ డాన్ తనయుడు అరెస్టు అయిన రోజు నుంచి వెస్ట్ జోన్ లో పనిచేస్తున్న ఓ సీఐ ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ ను నియమించి జైలు కు ప్రతి రోజు బిర్యాని పంపించి తన భక్తిని చాటుకున్నాడని ప్రచారం జరుగుతోంది.కాగా లిక్కర్ డాన్ తనయునితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సెంట్రల్ జోన్ లో పని చేస్తున్న ఓ సీఐ కీ బదిలీకి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మరోవైపు లిక్కర్ డాన్, తనయుడు పై కేసు నమోదు విషయం తెలుకున్న వెస్ట్ జోన్ లో పని చేస్తున్న ఓ సీఐ ఏకంగా తన ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఇచ్చి లిక్కర్ డాన్ ,తనయుడు పారిపోవాడనికి సహకరించినట్లు విచారణ తేలినట్లు తెలియవచ్చింది.

అంతేకాదు తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ సీఐ ఏకంగా ఓ ముందడుగు వేసి రానున్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కోటి ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. తనతో పాటు మరో 15 మంది సిఐ వద్దనుంచి సైతం ఇప్పిస్తానని గట్టిగానే మాట ఇచ్చారట. ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిది ఆ సీఐ పై గుర్రుగా ఉన్నట్లు వినికిడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here