అనుమతిలేని కట్టడాలు…?

గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రధానంగా త్రినగరిలో అనుమతిలేని కట్టడాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొంతమంది అనుమతులు తీసుకున్న తీసుకున్న అనుమతికి ఎలాంటి పొంతన లేకుండా నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జాగా ఉంటే చాలు కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది.

అనుమతిలేని కట్టడాలు...?- news10.app

వదిలేస్తున్న అధికారులు….?

త్రినగరిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్న,నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది అక్రమనిర్మాణాలు చేసిన తమ పరపతి తో అధికారులను ప్రసన్నం చేసుకొని నిర్మాణాలు పూర్తిచేస్తున్నట్లు తెలిసింది.మరి అవసరం అయితే నిర్మాణం తర్వాత అధికారులను. మ్యానేజ్ చేసి అనుమతులు పొందుతున్నారని సమాచారం.కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం నగరంలో బిల్డర్ అవతారం ఎత్తి మున్సిపల్ అనుమతులు లేకుండానే పని కానిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ కార్పొరేటర్ ఇలాగే నిర్మాణం చేస్తే కమిషనర్ సీరియస్ కాగా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. కానీ నగరంలో ఇలాంటి నిర్మాణాలు ఇంకా ఉన్నట్లు తెలిసింది.

సెట్ బ్యాక్ లు ఉండవు….?

నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్ల విస్తరణ సైతం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్కార్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న నిర్మాణాలకు,ఇతర నిర్మాణాలకు సెట్ బ్యాక్ తప్పనిసరి చేసింది.ఆయా నిర్మాణం చేస్తున్న ప్రాంతం, అక్కడ ఉన్న రహదారిని బట్టి కొన్ని నిబంధనలను ప్రభుత్వం విధించింది.కానీ కొంతమంది ఆ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. ప్రధాన రహదారులపై సైతం నిర్మాణాలు చేస్తూ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించి నిభందనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఇకనైనా దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ వాసులు కోరుతున్నారు.

ఇవిగో అక్రమ కట్టడాలు….

నగరంలో కొందరు బడాబాబులు నిబంధనలకు విరుద్దంగా చేసిన అక్రమ కట్టడాలపై న్యూస్10 వరుస కథనాలు రేపటి నుంచి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here