ఆ సూపరింటెండెంట్ మారేలా లేడు….?

హన్మకొండ లో డాట్ పద్దతి ద్వారా చికిత్సనందిస్తున్న ఓ పెద్దాసుపత్రికి సూపరింటెండెంట్ గా ఉన్న ఆ పెద్ద డాక్టర్ సాబ్ లో ఇప్పటికి ఏమార్పు లేదట. గతంలో ఈ సారు విధులకు హాజరు కావడం లేదని,హాజరు రిజిస్టర్ ను సైతం హైదరాబాద్ కె తెప్పించుకుని సంతకాలు చేస్తున్నాడని న్యూస్10 కథనం వెలువరించింది. దింతో కాస్త మారినట్లే కనిపించిన ఆ డాక్టర్ మళ్ళీ పాత పద్ధతినే అవలంబిస్తున్నట్లు తెలిసింది.నౌకరి హన్మకొండలో ఉండగా హైదరాబాద్ లో నివాసం ఉండే ఈ సూపరింటెండెంట్ నెలలో ఓ ఐదు సార్లు ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తే మహా ఎక్కువ అని ఆసుపత్రిలో ఉద్యోగులే అంటున్నారు. నిత్యం విధులకు డుమ్మా కొడుతూ ఈ సూపరింటెండెంట్ తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

ఆ సూపరింటెండెంట్ మారేలా లేడు....?- news10.app

కలెక్టర్ మందలించిన…?

గతంలో ఈ సారు డుమ్మాల వ్యవహారంపై న్యూస్10 ఓ కథనాన్ని వెలువరించగా సూపరింటెండెంట్ తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీరు మార్చుకోవాలని మందలించారు.దింతో కొద్దీ రోజులు ఆసుపత్రికి క్రమం తప్పకుండా వచ్చిన సూపరింటెండెంట్ ప్రస్తుతం మళ్ళీ అదే డుమ్మాల పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిసింది. సూపరింటెండెంట్ పాత పద్దతినే పాటిస్తుండడంతో కలెక్టర్ మందలించిన ఆ సారు పద్దతిలో ఏ మాత్రం మార్పు రాలేదని ఆసుపత్రిలో చర్చ జరుగుతుందట.కలెక్టర్ జోక్యం మందలింపు కారణంగా ఉద్యోగిలందరిలో మార్పు వచ్చిన సూపరింటెండెంట్ లో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇకనైనా ఈ సారు మారుతాడా లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here