అమ్మ ఆమోదించింది…..!

కార్యవర్గం రాజీనామాలు ఆమోదించిన అమ్మ శ్రీదేవి

వరంగల్ హంటర్ రోడ్ లోని అమ్మ అనాధ వృద్ధాశ్రమం కార్యవర్గ రాజీనామాలను ఆశ్రమం నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి ఆమొదించినట్లు వృద్ధాశ్రమం కోశాధికారి గడ్డం కేశవముర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తనతోపాటు ఆశ్రమం ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, కార్యవర్గ సభ్యులు తాటికొండ వీరస్వామి, మైదంశెట్టి సాంబయ్య, పూజారి విజయ్ కుమార్, బొజ్జమ్ చొక్కారావు లు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆశ్రమం అధ్యక్షురాలు రాచమల్ల శ్రీదేవి తమ రాజీనామాలు ఆమోదించినట్లు ఆయన తెలిపారు.అమ్మ ఆమోదించింది.....!- news10.app

వ్యక్తిగత కారణాలతోనే తాము రాజీనామా చేసి ఆశ్రమం నుంచి వైదొలుగుతున్నామని, సంస్థ ఆదాయ, వ్యయాలు, గొడవలతో తమకేం సంబంధం లేదని రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశమూర్తి లు స్పష్టం చేసారు. తమ రాజినామాలు ఆమోదించిన అమ్మ శ్రీదేవికి వారు కృతజ్ఞతలు తెలిపారు.