సంపాదనే ద్యేయంగా నడుస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల మూలంగా జనాలు ఇబ్బందులు పడాల్సివస్తుంది. వైద్యం మాట అటుంచితే ఆసుపత్రి నిర్వహిస్తున్న భవనానికి కనీస జాగ్రత్తలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇరుకు గదుల్లో ఎలాంటి రక్షణ లేకుండా నడుపుతున్న ఆసుపత్రుల వల్ల నిజానికి ఎప్పుడైనా ముప్పే నగర నడి బొడ్డున ఇలాంటి ఆసుపత్రులు కనపడుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసి చూడనట్లు వదిలివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది… వివరాల్లోకి వెళ్తే
బిల్డింగ్ అనుమతులతో పనేంటి ….?, ఫైర్ సేఫ్టీ తో అవసరం ఏంటి….? పార్కింగ్ లేకున్నా పర్లేదు…. అనే ఆలోచనలో హన్మకొండ లోని లష్కర్ బజార్ ప్రాంతంలో ఉన్న ఆ ఆసుపత్రి యాజమాన్యం ఉన్నట్టున్నారు…. వారికి తోడు వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా పై పై తనిఖీలతో పర్మినెంట్ అనుమతులు మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు.
ఆ ఆసుపత్రి ఉన్న భవనాన్ని చూసిన కూడా అనుమతులు ఎలా ఇచ్చారో వారికే తెలియాలి.నిజానికి ఇది క్షేత్ర స్థాయిలో భవనాన్ని పరిశీలించి ఇచ్చిన అనుమతిలా మనకు అసలు కనపడదు. అవును ఇది ఆసుపత్రి అని మనం నమ్మాలి అంతే… ఇలా ఎలాంటి రక్షణ ప్రమాణాలు పాటించకుండా హన్మకొండ నడిబొడ్డున సంపాదనే ధ్యేయంగా ఆర్థరైటిస్, రుమటిజం హాస్పిటల్ ని నడిపిస్తున్నారని పలువురి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. కనీస నియమాలు పాటించకుండా ఫైర్ సేఫ్టీ, కనీసం పార్కింగ్ స్థలం లేకుండా ప్రధాన రహదారి కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఆ బిల్డింగ్ ను నిర్మించారు… అంటే హాస్పిటల్ నుండి బయటికి వస్తే నేరుగా రోడ్డుపైకె అన్నమాట. ఈ ఆసుపత్రి భవనాన్ని చూస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా ఉండదని స్పష్టంగా కనిపిస్తోంది… ఎందుకంటే మెయిన్ రోడ్ కనుక వాహనాలు వేగంగా వెళుతుంటాయి ఏమరుపాటులో ఒక్క అడుగు ముందుకు వేస్తే పేషంట్ ల ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.
ఇదేకాకుండా అనుకోని సంఘటన వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనీసం ఫైర్ ఇంజన్ వచ్చి చుట్టూ తిరిగి మంటలు అదుపుచేయడానికి దాని చుట్టూ కనీసం ఒక్క గజం స్థలం కూడా లేదట … అలాంటి బిల్డింగ్ లో హాస్పిటల్ ఎలా నడుపుతున్నారో ఆ ఆసుపత్రి యాజమాన్యానికే తెలియాలి ఎలా పర్మినెంట్ అనుమతులు ఇచ్చారో వైద్యారోగ్యశాఖ అధికారులే చెప్పాలి… అసలు ఆ హాస్పిటల్ బిల్డింగ్ ప్లాన్ దేనికోసం ఇచ్చారు ఇంటి కోసమా? హాస్పిటల్ కోసమా? అనే విషయం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికయినా డిఎంహెచ్ఓ ఆ హాస్పిటల్ బిల్డింగ్ ను తనిఖీ చేసి దాని అనుమతులు రద్దుచేస్తారో లేదంటే ఆ యాజమాన్యానికే వంతపాడుతారో చూద్దాం….