పేర్లతోనే దోపిడీ….?

  • అనుమతులు ఉండవు, నిబంధనలు అసలే పట్టవు
  • ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఇష్టారాజ్యం

అందమైన పేరుతో మాయ చేస్తారు… అలాంటి పేర్లు ఉండకూడదని చెప్పిన ప్రభుత్వం జీవో లు తెచ్చి మరీ చెప్పిన అసలే వినరు ఆ మాటలను పెడచెవిన పెడతారు టెక్నో, ఇంటర్నేషనల్, గ్లోబల్ అంటూ ఏవో మాటలు చెపుతారు… చెప్పే చదువుకు వసూల్ చేసే పిజులకు అసలు పొంతన లేకుండా తోచినకాడికి విద్యార్థుల తల్లిదండ్రులను పీజు కోసం పిండేస్తారు.. ఇంకొందరైతే అసలు అనుమతులే లేకున్నా దర్జాగా పాఠశాలను నడిపిస్తారు… మరికొందరు దివాళా తీసిన పాఠశాలలను కొత్త పేరుతో కొనసాగిస్తారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి.నిజానికి చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తోంది నడిపించలేక సరైన ఆర్థిక బలం లేక కరోనా మూలం గా కొన్ని పాపం చిన్న చితక ప్రైవేటు బడులు మూత బడ్డాయి. కానీ నూతనంగా ఏర్పడిన హన్మకొండ జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి మొత్తం 12 మండలాల్లో కలిపి ప్రాధమిక, ఉన్నత, రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాలు 321గా జిల్లా విద్యాశాఖ గుర్తించింది.

పేర్లతోనే దోపిడీ....?- news10.app

ఇది పేర్ల కథ….

విధ్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రయివేటు పాఠశాలలపై పర్యవేక్షించవలసిన విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎలా వ్యవహరించిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో అనుమతులు లేకున్నా ఐఐటీ ఫౌండేషన్,రెసిడెన్షియల్ పేర అందమైన పేర్లతో బోర్దు లు ఏర్పాటు చేసి విద్యార్థుల నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ నుండి పూర్తి స్థాయిలో అనుమతులు లేకున్నా… ఉన్నత స్థాయి తరగతులు నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నారని. వసతులు లేకున్నా, అర్హత లేని అధ్యాపకులు భోదిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.. తూతుమంత్రంగా పాఠశాలను పర్యవేక్షిస్తూ జిల్లా, మండల విద్యా శాఖ అధికారులు కార్పొరేట్ బడుల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని. కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలి అనుమతులు లేకున్నా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తున్న బడులకు క్రీడా మైదానాలు, అగ్నిమాపక శాఖ నుండి ఫైర్ సేఫ్టీ అనుమతి తప్పనిసరి కానీ అనుమతి లేకున్నా ఆడిగేవారే లేకుండా పోయారట.. ఇలాంటి సమస్యల ను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు మాత్రం కంటి తుడుపు వ్యవహారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

అనుమతులు ఏవి…?

ఇది ఇలా ఉంటే ఇటీవల ఖాజీపేటలో విద్యాశాఖ అనుమతులతో నడిచిన ఓ ప్రయివేటు పాఠశాల కరోన కారణంగా కొద్దీ రోజుల క్రితం మూతపడిన ఆ పాఠశాలను ఓ కార్పొరేట్ యాజమాన్యం లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా కొత్త పేరుతో పాఠశాలను స్థాపించింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల పేరుతో తాత్కాలిక బోర్డులు ప్రదర్శిస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ కు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడానికి వెనుకడుతున్నారని సమాచారం. అలాగే
ఇలాంటి వ్యవహారమే ఎల్కతుర్తి మండల ని ఓ పాఠశాల యాజమాన్యం కొనసాగిస్తున్నట్లు తెలియవచ్చింది.

అధికారులు కదిలేనా….?

ఓ వైపు కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం మొత్తం ఒడిదుదుకులుగా కొనసాగుతుంటే ,కరోనా సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతుటే తమకు తోచిన రీతిలో పీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారులు ఎక్కడకు కదలకుండా ఫిర్యాదు లు వచ్చిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి సంబంధం లేని పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తూ, అసలు అనుమతులు లేకున్నా పాఠశాలలు నడుపుతున్న వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here