వింత శిశువు జననం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వింత శిశువు జన్మించింది శుక్రవారం జిల్లా లోని ఏరియా హాస్పిటల్ కు నాగారం గ్రామానికి చెందిన బొద్దులరాజు భార్య, కళ ను ప్రసవ నిమిత్తం ఆశ కార్యకర్త ఏరియా హాస్పిటల్ కు తీసుకువచ్చింది. ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్న వైద్యులు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు, గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత సమక్షంలో సాధారణ ప్రసవం జరిగింది. కళ ఆడ శిశువుకు జన్మ నిచ్చింది.

పాప జన్మించగానే వైద్యులు కావాల్సిన వైద్యాన్ని అందించారు. వింత శిశువు జననం సమాచారాన్ని అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆప్పయ్యఏరియా ఆస్పత్రికి చేరుకొని పాప ఆరోగ్య పరిస్థితిని అడిగిన తెలుసుకున్నారు. పాప బరువు 2 కిలోలు ఉన్నట్లు ఆయన తెలిపారు.అనంతరం పాపను మరింత మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఐతే పాప ఇలా జన్మించడానికి కారణం చర్మ వ్యాధి ఐ ఉంటుందని వైద్యులు అంటున్నారు.