కబ్జారాయుళ్లు పోలీసులకు దొరకడం లేదట….?

ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్లకుపైగా విలువచేసే ప్రభుత్వ భూమి ఆ భూమి పై కొందరు కబ్జారాయుళ్ల కన్ను పడింది.గుట్టుచప్పుడు కాకుండా మెల్లమెల్లగా ఆ భూమిని కబ్జా చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు… అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి దాటాక ఎవరికి తెలియకుండా జేసిబి లతో భూమిని చదును చేసి సర్కార్ భూమిని కొందరు అక్రమార్కులు తమ ఖాతాలో వేసుకుందామనుకున్నారు. కానీ వారి ఆటలు సాగలేదు న్యూస్10 నిఘాటీం భూకబ్జా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది.దింతో వెంటనే స్పందించిన హన్మకొండ తహశీల్దార్ రాజ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి ఈ భూమి ప్రభుత్వ భూమి అంటు హెచ్చరిక సూచికలు పెట్టించారు. సూచికలు పెట్టడం నచ్చని అక్రమార్కులు వాటిని తొలగించివేశారు.దింతో రెవెన్యూ సిబ్బంది తిరిగి హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ని కబ్జా చేస్తున్నవారెవరో ఇప్పటికి పోలీసులు కనిపెట్టలేకపోయారు.

కబ్జారాయుళ్లు పోలీసులకు దొరకడం లేదట....?- news10.app

ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించారు, రాతికిరాత్రే జేసిబి తో చదును చేసి అక్కడఉన్న ఓ చిన్న పాటి గుట్టను సైతం పిండి చేశారని హన్మకొండ తహశీల్దార్ సుబేదారి పోలీసులకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. దింతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు అంటూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు .కానీ ఇప్పటికీ ఆ గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఈ కబ్జా వ్యవహారం,తహశీల్దార్ పిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు కబ్జా చేయాలని ప్రయత్నించిన వారిని పట్టుకునే విషయంలో ఇప్పటికి సక్సెస్ కాలేక పోయారు.మరో వైపు దీన్ దయాల్ నగర్ లోని స్థానికులను ఈ కబ్జా విషయం పోలీసులు ఆరా తీయగా అర్ధరాత్రి ఎవరు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి బరితెగించారో వారు చెప్పిన పోలీసులు ఆ దిశలో విచారణ జరిపి వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలిసింది. కాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జేసిబి తో తవ్వకాలు జరుపుతున్న సమయంలో అక్కడ ఉన్న కొన్ని సిసి కెమెరాల్లో రికార్డ్ ఐయినట్లు తెలిసింది. ఈ పూటేజీని పోలీసులు పరిశీలించిన కబ్జా అక్రమార్కులు దొరికిపోతారు .కానీ పోలీసులు అలా కూడా చేయడం లేదట.ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి తవ్విన జేసిబి ఎవరిదో ఆరా తీసిన కబ్జా దొంగ లెవరో బయటపడతారు కానీ పోలీసులు అది కూడా ఆరా తీయడానికి ముందుకు రావడం లేదట.కేవలం గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా కు యత్నించారని ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసి సుబేదారి పోలీసులు చేతులు దులుపుకున్నట్లుగా కనపడుతోంది. అసలు దొంగలేవరో బట్టబయలు చేసే దిశగా పోలీసులు తమ విచారణ కొనసాగించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ ఒత్తిళ్లు…?

హన్మకొండ హంటర్ రోడ్ జూపార్కు ఎదురుగా ఉన్న దీన్ దయాల్ నగర్ లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.ఓ రాజకీయనాయకుడే ఈ కబ్జాకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.అందుకే పోలీసులు కబ్జా చేసినవారిపై చర్యలకు వెనుకాడుతున్నారని సమాచారం.గుర్తుతెలియని వ్యక్తులు అని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ వ్యక్తులు ఎవరో బహిర్గత పరచడానికి,వారిపై కేసు నమోదు చేయడానికి వెనుకాడుతున్నట్లు తెలిసింది.ఓ ప్రజాప్రతినిధి అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొనే కబ్జాకు యత్నించిన సదరు రాజకీయ నాయకుడు పైరవిలతో చక్రం తిప్పుతూ ఇప్పటికి విలువైన ఆ ప్రభుత్వ భూమి పై ఆశలు కొట్టివేసుకోలేదని తెలుస్తుంది.దీనికి తగ్గట్టు పోలీసులు సైతం రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకపోయేసరికి అతగాడు కొంతమంది సహకారంతో పైరవీలను అలాగే కొనసాగిస్తూ ఎప్పటికైనా ఆ విలువైన ప్రభుత్వ భూమి తన సొంతం కాక తప్పదని పోజులు కొడుతున్నట్లు తెలిసింది.మరి ఇప్పటికైనా పోలీసులు సదరు రాజకీయా నాయకుని పై కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here