పటాకుల మాటున జీరో దందా….! ఐటి చర్య లుండవా.

వెలుగుల పండుగ దీపావళి పటాకుల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది…గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది వ్యాపారం కాస్త జోరుగానే కొనసాగింది. కాలుష్య రహిత దీపావళి,బాంబుల మోతకు సమయాన్ని కేటాయించిన దీపావళి సందర్బంగా ప్రజలు పటాకులను భారీగానే కొనుగోలు చేశారు… వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీపావళి బాంబుల వ్యాపారం బాగానే కొనసాగింది. బాంబుల వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించిన చిన్న చిన్న గల్లుల్లో విక్రయాలు జరిపిన అధికారులు కనీసం అటువైపైన కన్నెత్తి చూడలేదనే విమర్శలు ఉన్నాయి.

పటాకుల మాటున జీరో దందా....! ఐటి చర్య లుండవా.- news10.app

అంతా జీరో దందా….?

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీపావళి పటాకుల వ్యాపారం జోరుగా కొనసాగిన …అంతా జీరో దందగానే కొనసాగిందట.లక్షల్లో, వేలల్లో బాంబులను విక్రహించిన బడా వ్యాపారులు మాత్రం ఎలాంటి బిల్లులు లేకుండానే బాంబులను విక్రయించారట.కొనుగోళ్లు చేయడం తప్ప ఎలాంటి బిల్లు లేకుండానే చాలామంది పటాకులు పేల్చారట….వెయ్యి రూపాయల విక్రయాలను ఈజీగా తీసుకున్న లక్షల్లో ,వేలల్లో జరిగిన విక్రయాలకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా బాంబుల వ్యాపారులు భాజాప్త జీరో దందా నడిపిన అధికారులు ఎవరు పట్టించుకోక పోవడం అనుమానాలకు దారి తీస్తోంది.

ఐటి దృష్టి సారించేనా….

వరంగల్ ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయల దీపావళి బాంబుల వ్యాపారం జీరో దందా గా కొనసాగిన ఇప్పటికి అధికారులు ఎవరు ఏమాత్రం స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి.కోట్ల రూపాయల వ్యాపారం జీరో దందా కింద కొనసాగిన ఐటి అధికారులు,సేల్స్ ట్యాక్స్ అధికారులు కనీసం కొనుగోళ్ల వ్యవహారంపై దృష్టి సారించక పోవడంతో బాంబుల వ్యాపారులు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

జనగామ లో భారీ దందా….?

ఈసారి దీపావళి బాంబుల వ్యాపారంలో జనగామకు చెందిన ఓ బాంబుల వ్యాపారి జీరో దందాను కోట్లల్లో జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.ఈ వ్యాపారికి తోడు వరంగల్ నగరానికి చెందిన మరో వ్యాపారి సైతం జీరో దందాలో వ్యాపారం బాగానే జరిపినట్లు సమాచారం.వీరు తమ వ్యాపారాన్ని జీరో దందాలో కోట్లల్లో జరిపిన ఐటి అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించడంతో ఈ వ్యాపారులు తమ దందాను ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తున్నట్లు తెలిసింది.ఎలాంటి బిల్లులు లేకుండా పటాకుల వ్యాపారం జీరో దందాలో నడిపిన ఈ వ్యాపారుల ఆదాయం పై ఇప్పటికైనా ఐటి అధికారులు దృష్టి సారిస్తార లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here